కీచక (2015)(A)
Release date
30 Oct 2015
genre
కీచక స్టోరి
కీచక సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో యామిని భాస్కర్, జ్వాలా కోటి, రఘు బాబు, గిరి బాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎన్ వి బి చౌదరి నిర్వహించారు మరియు నిర్మాత కిశోర్ పర్వతరెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు డార్ జోస్యబట్ల శర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
గాంధీనగర్ బస్తీ లో సుజాత(యామినీ భాస్కర్) అనే సాప్ట్ వేర్ ఇంజినీర్ హైదరాబాద్ నుంచి వస్తుంది. ఆమె వచ్చేసరికి అక్కడ పరిస్ధితులు ఏ మాత్రం బాగోవు..కోటి(జ్వాలా కోటి) అనే రేపిస్ట్,రౌడీ ఆ బస్తీలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ, అందరినీ భయభ్రాంతులను చేస్తూంటాడు. అతనికి అఫ్పటికే 300 వందల మందని రేప్ చేసిన చరిత్ర ఉంటుంది. దాంతో సుజాతకు సైతం చాలా మంది అక్కడ నుంచి వెళ్లిపొమ్మని సలహా ఇస్తారు. కానీ సుజాత అక్కడకు ఓ లక్ష్యం మీద వచ్చానని, అది నెరవేరేవరకూ ఆ బస్తీ వదలనని, తన లక్ష్యం నెరవేందుకు అసరమైతే తన ప్రాణాలు సైతం పణంగా పెట్టడానికి సిద్దమని అంటుంది. ఇంతకీ సుజాత లక్ష్యం ఏమిటి...ఆమె రాకకూ, రేపిస్ట్ కోటికు ఏమన్నా సంభంధం ఉందా...కోటి చరిత్ర ఎలా ముగిసింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
**Note:Hey! Would you like to share the story of the movie కీచక with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు