Telugu » Movies » Khaidi No 150 » Story

ఖైదీ నెంబర్ 150 (U/A)

సినిమా శైలి

Action

పాఠకుల రివ్యూ

విడుదల తేదీ

11 Jan 2017
కథ
ఖైదీ నెంబర్ 150 సినిమా తమిళంలో విజయం సాధించిన 'కత్తి' చిత్రానికి రీమేక్‌ ఈ సినిమా ఇది యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్, తరుణ్ అరోర, వెన్నెల కిశోర్, సునిల్, అలీ, రాయ్ లక్ష్మి, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం వి వి వినాయక్ నిర్వహిస్తున్నారు మరియు కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ పతాకంపై రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చురు.

కథ

కోల్‌కతా సెంట్రల్‌జైల్‌లో ఉన్న కత్తి శీను(దొంగ పాత్రలో చిరంజీవి) అక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాద్‌కి వస్తాడు. (జైల్లో చిరంజీవి ఇంట్రడక్షన్ అదిరింది).అక్కడి నుంచి బ్యాంకాక్‌కు వెళ్లిపోవాలని స్కెచ్ వేసుకుంటాడు. కానీ ఎయిర్ పోర్ట్ లో ... ల‌క్ష్మి (కాజల్)ని చూస్తాడు. లవ్ ఎట్ పస్ట్ సైట్ అంటూ ప్రేమలో పడిపోతాడు. తను ప్రేమించిన అమ్మాయి లక్ష్మి కోసం ఆగిపోతాడు. తన దిల్‌కా దడ్కన్‌ కోసం విదేశం వెళ్లకుండా వెనక్కి వచ్చేసిన కత్తి శీను. ఆ సమయంలోనే ఓ వ్యక్తిని హత్య చేయబోవడాన్ని చూస్తాడు. అప్పుడే అచ్చం తనలాగే ఉన్న వ్యక్తి శీను కంటపడతాడు. అతడే శంకర్‌ (చిరంజీవి ద్విపాత్రాభినయం). అతను తనలానే ఉండటంతో ఆశ్చర్యానికి గురి అవుతాడు. తనలాగే ఉన్న శంకర్‌ని పోలీసులు దొంగ అనుకునేలా చేసి, వాళ్లకు పట్టిస్తాడు కత్తిశీను. శంకర్ ఎవరంటే.. ఓ సోషల్ యాక్టివిస్ట్. రైతుల పక్షాన నిలిచి వారి కోసం పోరాడే రైతు నాయకుడు అని తెలుస్తుంది. మళ్లీ ఫారిన్ వెళ్లటానికి ప్రయత్నాలు చేసుకుంటున్న వేళ.. కత్తి శీనును శంకర్ గా భావించిన కలెక్టర్ అతన్ని రైతులున్న వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు. మరో ప్రక్క విలన్ ఎంట్రీ...ఓ ఎమ్ ఎన్ సి కంపెనీ ఓనర్ అగర్వాల్(తరుణ్ అరోరా) రైతుల భూముల్ని కాజేసి.. అక్కడో కూల్ డ్రింక్స్ కంపెనీని పెట్టాలనుకుంటాడు. కత్తి శీనును చూసిన అగర్వాల్ అతన్ని రైతు నాయకుడు శంకర్ గా భావించి.. రైతుల భూముల్ని తనకిచ్చేలా చేస్తే రూ.25కోట్లు ఇస్తామని బేరం పెడతాడు. దీనికి ఓకే అంటాడు శంకర్ రూపంలో ఉన్న కత్తి శీను. అయితే శంక‌ర్‌కు సన్మాన కార్యక్రమంతో.. అతడి ఎవరు ఏంటి అనే విషయాలు కత్తి శీనుకు తెలుస్తాయి. రైతుల క్షేమం కోసం శంకర్ ఎంతగా ఆలోచిస్తున్నాడు.. తపిస్తాడన్నది తెలీటంతో పాటు.. విలన్ అగర్వాల్ కుట్ర,దాని వల్ల అన్నదాతలకు జరుగుతున్న నష్టం ఏమిటో అర్థమవుతుంది. రైతుల పక్షాన నిలిచి.. శంకర్ ఆశయాల్ని అమలు చేయాలని కత్తిశీను అనుకుంటాడు. రైతుల భూముల్ని కాజేయాలనుకున్న అగర్వాల్ కుట్రకు చెక్ చెబుతూ.. రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం చేస్తాడు. దీంతో కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ కు.. రైతు నాయకుడు శంకర్ గా మారిన కత్తి శీనుకు మధ్య యద్దంమొదలవుతుంది. విలన్ అగర్వాల్ కార్పోరేట్ కుట్రను ఏ విధంగా అడ్డుకున్నాడు? రైతుల పంట భూములు కోల్పోకుండా చేశాడా? అగర్వాల్ కు చెక్ పెట్టేందుకు కత్తి శీను వేసిన స్కెచ్ ఫలించిందా? శంకర్ ఏమయ్యాడు? లక్ష్మీ.. కత్తి శ్రీనుల లవ్ స్టోరీ ఏమైంది? కత్తి శీను ఫారిన్ ప్రయాణం ఏమైంది? అన్నవి తెలుసుకోవాలంటే వెండితెర మీద సినిమాను చూడాల్సిందే.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu