ఖాకి (2017)(U/A)
Release date
17 Nov 2017
genre
ఖాకి స్టోరి
ఖాకి సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కార్తీక్ శివకుమార్, రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, స్కార్లెట్ మెల్లిష్ విల్సన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వినోద్ హెచ్ వహించారు మరియు నిర్మాతలు ప్రభు ఎస్ ఆర్, ప్రకాష్ బాబు ఎస్ ఆర్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జిబ్రాన్ అందించారు.
కథ
ధీరజ్ (కార్తీ) నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. నిక్కచ్చిగా డ్యూటీ చేయడం మూలంగా ట్రాన్సఫర్లతో జీవితం ముందుకెళ్తుంటుంది. ఆ క్రమంలో తమిళనాడులో క్రూరమైన వరస దోపిడిలు పోలీస్ శాఖకు సవాల్‌గా నిలుస్తాయి. దోపిడిలకు పాల్పడుతున్నది అంతర్రాష్ట దొంగల ముఠా అని తన ఇన్వెస్టిగేషన్లో ధీరజ్ తెలుసుకొంటాడు. దోపిడి దొంగల దాడి కారణంగా తన భార్య (రకుల్)ను కోల్పోతాడు. అంతర్రాష్ట దొంగల ముఠా ఆటను ఎలా కట్టించాడు. ఆ క్రమంలో ఎలాంటి సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? రకుల్ ఏ కారణంగా ప్రాణాలు కోల్పోయింది? కీలకమైన కేసును ఛేదించిన ధీరజ్‌కు పై అధికారుల నుంచి ఎలాంటి పరిస్థితి ఎదురైంది అనే ప్రశ్నలకు సమాధానమే ఖాకి.
**Note:Hey! Would you like to share the story of the movie ఖాకి with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు