కొబ్బరి మట్ట (2019)
Release date
10 Aug 2019
genre
కొబ్బరి మట్ట స్టోరి
కొబ్బరి మట్ట సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ అంతేకాదు కొందరు కులం లోంచి పుడతారు.. కొందరు జనం లోంచి పుడతారు.. కానీ.. పుట్టుకతో మీసమున్న ఓ వీరుని కథ... ఇందులో పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడ్ గా సంపూర్ణేష్ బాబు కనిపించబోతున్నాడు. ఇంకా ఈ సినిమాలో ఇషికా సింగ్, మహేష్ కత్తి తదితరులు నటించారు. ఈసినిమాకి దర్శకత్వం స్టీవెన్ శంకర్ నిర్వహింస్తున్నారు మరియు నిర్మాత సాయి రాజేష్ నీలం నిర్మిస్తున్నారు. ఈ సినిమా మరిన్ని వివరాలు కోసం వేచిచూచండి...
కథ
పెదరాయుడు (సంపూర్ణేష్ బాబు) గ్రామ పెద్దగా ఎదైనా అన్యాయం జరిగితే తన తీర్పును ఇచ్చి వారిని ఆదుకొంటాడు. ముగ్గురు భార్యలు, ముగ్గురు సోదరులు, ఇద్దరు చెల్లెలతో ఓ కుటుంబానికి పెద్దగా ఉంటాడు. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆయన జీవితంలోకి కొడుకు నంటూ అండ్రాయుడు (సంపూ) ప్రవేశించి పెద్దరికాన్ని నిలదీస్తాడు. పెద్ద రాయుడు ఇంట్లోని పనిమనిషి (షకీలా) కొడుకుగా తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకొంటానని శపథం చేస్తాడు. పెద్ద రాయుడు, పనిమనిషికి గల సంబంధమేమిటి? ఆమెకు పెద్దరాయుడు ఎలాంటి ద్రోహం చేశాడు? ముగ్గురు భార్యలను ఎందుకు చేసుకొన్నాడు? అతి పెద్ద కుటుంబం బాధ్యతను తను ఎందుకు భుజానికి ఎత్తుకొన్నాడు? పెద్ద రాయుడు తండ్రి పాపారాయుడికి ఎలాంటి ద్రోహం జరిగింది? పెద్దరాయుడుపై అండ్రాయుడు పగదీర్చుకొన్నాడా? పెద్దరాయుడుపై పడిన నిందలు తప్పని అండ్రాయుడు ఎలా నిరూపించాడు అనే ప్రశ్నలకు సమాధానమే కొబ్బరి మట్ట సినిమా కథ.
కలెక్షన్లు
ఇక తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 71 లక్షల నికర వసూళ్లను సాధించింది. రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1.32 కోట్ల నికర వసూళ్లు, 2.2 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సంపూ కెరీర్లోనే అత్యధికంగా వసూళ్లను సాధించిన చిత్రంగా ఓ రికార్డు క్రియేట్ అయింది.
ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.2 కోట్లకుపైగా అమ్మడం జరిగింది.
**Note:Hey! Would you like to share the story of the movie కొబ్బరి మట్ట with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు