twitter

    కుమారి 21F స్టోరి

    కుమారి 21F సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్ తరుణ్, హేబా పటేల్, నొయల్, నవీన్ నేని, సుధర్షన్, హేమ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈసినిమకి దర్శకత్వం సుర్య ప్రతాప్ నిర్వహించారు మరియు నిర్మాత సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈచిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చరు.

    కథ

    సిద్దు(రాజ్ తరుణ్) బెస్ట్ ఫ్రెండ్స్ శంకర్(నోయెల్), ఫోటోల సురేష్(నవీన్), సొల్లు శీను(సుదర్శన్). ఫ్రెండ్స్ ముగ్గురూ ఎటిఎం దొంగతనాలు చేస్తూ బ్రతుకుతూంటే... హీరో వారికి సాయిం చేస్తూంటాడు. ఈ లోగా వారి కాలనీకి...కుమారి (హేబా పటేల్) వస్తుంది. ఆమె ఓ మోడల్. ఇప్పటి మెట్రో యూత్ కు ప్రతిబింబంగా ఉండే ఆమె ... మనస్సులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, అందరితో సోషల్ గా మూవ్ అవటం చేస్తూంటుంది. ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోయిన సిద్దు...ఆమె బోల్డ్ నెస్, స్పీడుగా దూసుకుపోయే గుణం, సోషల్ గా మూవ్ అవటం చూసి అనుమానిస్తాడు. అతని అనుమానానికి అతని స్నేహితులు ఆమె గురించి నెగిటివ్ గా మాట్లాడి ఆజ్యం పోస్తారు. దానికి కారణం వారూ ఆమెపై కన్నేయటమే. ఈ క్రమంలో ఏం జరిగింది. అలాంటి వారితో స్నేహం చేసిన సిద్దుకు ఏం సమస్య వచ్చింది. చివరకు సిద్దు, కుమారీలు ఎలా ఒకటయ్యారు వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
    **Note:Hey! Would you like to share the story of the movie కుమారి 21F with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X