twitter

    కుందనపు బొమ్మ స్టోరి

    కుందనపు బొమ్మ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు చాందిని చౌదరి, సుధాకర్ కొమకుల, సుధీర్ వర్మ, రాజివ్ కనకాల, నాగినీడు, శకలక శంకర్, జాన్సీ తదిరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వర ముళ్ళపూడి నిర్వహించారు మరియు నిర్మాతలు జి అనిల్ కుమార్ రాజు, జి వంశి కృష్ణా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చరు.

    కథ

    విజయనగరం దగ్గర ఓ పల్లెటూళ్లో ఉండే... మహదేవరాజు (నాగినీడు)ది మాటంటే మాటే. ఆ ముద్దుల కుమార్తే సుచి (చాందిని చౌదరి) . ప్రాణానికి ప్రాణంలా చూసుకునే ఆమెను పుట్టినప్పుడే తన మేనల్లుడు గోపి (సుధాకర్‌)కి ఇచ్చి చేయాలని ఫిక్స్ చేసి ప్రకటించేస్తాడు. అయితే తండ్రి చాటు పిల్లలా బిల్డప్ ఇచ్చే సుచి బయిటకు వస్తే బస్తేమే సవాల్ అనే అల్లరి పిల్ల. అల్లరిలో భాగంగా ఓ దొంగతనం చేస్తూండగా వాసు (సుధీర్‌ వర్మ) చూస్తాడు. అంతే అమాంతం అలాగే ప్రేమలో పడిపడి, ఆమెను పడేసే ప్రయత్నాలు చేస్తాడు. వీళ్ల ప్రేమ వ్యవహారం గమనించిన ఆమె బావ గోపి కూడా సపోర్ట్ చేస్తాడు. అంతవరకూ బాగానే ఉన్నా..హఠాత్తుగా ఓ ట్విస్ట్ వచ్చి ఈ ప్రేమ కథలో పడుతుంది. గోపీ ..ఎట్టిపరిస్దితుల్లో ...సుచినే చేసుకుంటాను అని ఇంట్లో ప్రకటిస్తాడు. అతను అలా అనటానికి కారణం ఏమిటి..అసలు ఈ ప్రేమ కథకు ముగింపు ఏమిటి...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  
    **Note:Hey! Would you like to share the story of the movie కుందనపు బొమ్మ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X