twitter

    విమర్శకుల సమీక్ష

    • మహేంద్ర సింగ్ ధోనీ... క్రికెట్ ను మతంగా అభిమానించే భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. సక్సెస్ ఫుల్ వికెట్ కీపర్ గా, సక్సెస్ ఫుల్ బ్యాట్స్ మెన్ గా, అంతకంటే సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా, ఎలాంటి పరిస్థితులను అయినా కూల్ గా హ్యాండిల్ చేసే సారథిగా ధోని మనకు తెలుసు. ఇదంతా నాణేనికి ఒక వైపు... మనకు తెలియని ధోనీ జీవితం ఎంతో ఆసక్తికరం... ధోనీ పాత్రను పోషించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి చెప్పుకోవాల్సి వస్తే....పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు....అతడు ధోనీ పాత్రలో నటించాడు అనడం కంటే జీవించాడు అనే చెప్పాలి. దర్శకుడు నీరజ్ పాండే తన బాధ్యతకు పూర్తి న్యాయం చేసాడు. ముఖ్యంగా చిన్నతనం నుండి ధోనీ క్రికెటర్ గా ఎదుగుతున్న తరుణంలో వచ్చే సన్నివేశాలు అభిమానుల రోమాలు నిక్కపొడిచేలా తెరకెక్కించి అదరగొట్టాడు. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. కొన్ని చోట్ల సినిమా స్లో అయినట్లు అనిపించినా మళ్లీ వెంటవెంటనే సినిమా పుంజుకున్నట్లు ఉండటంతో ప్రేక్షకుల్లో ఆ ఫీలింగ్ రాదు. డైలాగ్స్ కూడా బావున్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X