twitter

    ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ స్టోరి

    ఎం ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమా భారత క్రికెట్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఆత్మకథతో తెరకెక్కిన చిత్రం ఇందులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రేయష్ తల్పాడే, కైరా అద్వాని, దిశా పతాని, అనుపమ్ ఖేర్, భూమికా చావ్లా, రాజేష్ శర్మ, గౌతమ్ గులాటి, హెర్రి తంగ్రి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నీరజ్ పాండే నిర్వహించారు మరియు నిర్మాత అరుణ్ పాండే నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అమాల్ మాలిక్ స్వరాలు సమకుర్చరు. 

    కథ

    రాంచీలో సాధారణ పంపు ఆపరేటర్ భాన్ సింగ్. తనకు సరైన చదువు అందలేదు, సరైన ఉద్యోగం లేదు, తన పిల్లలైనా బాగా చదువుకుని మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తనకంటే బాగా బ్రతకాలని ఆశపడే ఒక మధ్యతరగతి తండ్రి. భాన్ సింగ్ కుమారుడు మహేంద్రసింగ్ ధోనికి చిన్నతనం నుండే ఆటలంటే ఆసక్తి. ధోనీ స్కూల్ లో ఫుట్ బాల్ టీంకు గోల్ కీపర్. బంతిని క్యాచ్ చేయడంలో అతని టాలెంట్ గమనించిన స్కూల్ కోచ్ స్కూల్ క్రికెట్ టీంకు వికెట్ కీపర్ లేని లోటును పూడ్చేందుకు ధోనీని తీసుకుంటారు. చిన్నతనం నుండే ధోని వికెట్ కీపింగ్, బ్యాటింగులో మంచి ప్రతిభ చూపిస్తూ ఎదుగుతాడు. తన విభిన్నమైన ఆటతీరు, మరెవరూ ఆడలేని అసాధారణమైన షాట్లు....చూసేవారిని మంత్రముగ్ధులను చేసే బ్యాటింగ్ స్టైల్ తో లోకల్ గా బాగా ఫేమస్ అవుతాడు. ధోనీ ఆడుతుంటే చూసేందుకు గుంపులుగుంపులుగా లోకల్ ఫ్యాన్స్ తరలివస్తుంటారు. సరిగ్గా అండర్ 19 వలర్డ్ కప్ సెలక్షన్స్ ట్రయల్స్ జరిగే సమయం.... తనకు పరీక్షల సమయం ఒకేసారి వస్తుంది. ఉదయం పూట పరీక్షలు రాస్తూ, అయిపోగానే రాంచీ నుండి పరుగు పరుగున ట్రైన్ లో జంషెడ్ పూర్ లో జరిగే సెలక్షన్స్ ట్రయల్స్ కు వెలుతూ ధోనీ ఎంత కట్టపడ్డాడో మాటల్లో చెప్పడం కంటే తెరపై చూస్తేనే బావుంటుంది. అయితే అప్పటి బీహార్ స్టేట్ క్రికెట్ సంఘంలో పాలిటిక్స్ వల్ల ధోనీ అండర్ 19 వరల్డ్ కప్ కు సెలక్ట్ కాలేకపోతాడు, తర్వాత కోల్ కతాలో జరుగుతున్న దులీప్ ట్రోపీలో ఆడే అవకాశం అభించినా....సమయానికి అక్కడికి చేరుకోలేని దుస్థితి. కట్ చేస్తే.... రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం తనను వెతుక్కుంటూ వస్తుంది. తన కొడుకు గవర్నమెంటు ఉద్యోగి అయ్యాడనే తండ్రి ముఖంలో సంతోషాన్ని చెరిపేయడం ఇష్టంలేక... పరిస్థితులకు రాజీపడి ఖరగ్‌పూర్‌లో ఇండియన్ రైల్వేస్ లో టికెట్ కలెక్టర్ గా ఉద్యోగంలో చేరుతాడు. అటు ఇష్టం లేని ఉద్యోగం చేయలేక, ఇటు తనకిష్టమైన క్రికెట్ ను వదిలి పెట్టలేక ధోనీ ఏం చేసాడు? ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఇండియన్ టీంలోకి సెలక్ట్ కావడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి అనేది తెరపై చూస్తేనే సినిమా మంచి కిక్ ఇస్తుంది.

    **Note:Hey! Would you like to share the story of the movie ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X