twitter
    TelugubredcrumbMoviesbredcrumbMajnubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సినిమా ట్రైలర్స్, ఫస్ట్ లుక్ చూసి, నాని ఈ కథను ఒప్పుకున్నాడంటే ఏదో కొత్తగా చెప్పే ట్రెండీ లవ్ స్టోరీ ఉంటుదంని భావిస్తాం. కానీ రెగ్యులర్ గా వచ్చే ఇద్ద‌ర‌మ్మాయిలు ఒక అబ్బాయిని ప్రేమించటం, అబ్బాయి మాత్రం ఒక అమ్మాయినే ప్రేమిచటం, . ఆ అమ్మాయికేమో వేరే వారితో నిశ్చితార్థం జ‌రుగి, పెళ్లి దాకా వెళ్లటం. చివ‌ర‌కు హీరో అమ్మాయిని ఎలా ద‌క్కించుకుంటాడ‌నేదే క‌థ‌నే చెప్పారు. దాదాపు రొమాంటిక్ కామెడీలు, లవ్ స్టోరీల క్లైమాక్స్ లు ఒకేలా ఉంటూంటాయి. ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ దగ్గర హీరో గతంలో తన ప్రేమ కథ చెప్తూ...ఆమెతో ప్రేమలో ఉన్నానని గ్రహించటం అనేది వినటానికి బాగానే ఉన్నా...తెరపై సరిగ్గా అది ఎగ్జిక్యూట్ కాలేదు. ద్వితీయ విఘ్నం దాటటానికి రొటీన్ పంధానా ఎంచుకున్నాడు...ఎంత రొటీన్ అంటే సెకండాప్ లో వచ్చే సీన్స్ అన్ని మనకు ఎక్కడో చూసినట్లే అనిపిస్తూంటాయి. అప్పట్లో వచ్చి హిట్టైన అల్లరి మొగుడు తరహా చిత్రా టైప్ లో ఇద్దరి హీరోయిన్స్ మధ్య నలిగే హీరో కథలా అనిపిస్తూంటాయి. ఈ సినిమాకు ప్లస్ నాని అనే దాని కన్నా నాని లేకపోతే ఈ సినిమా లేదు అనటం మేలు. ఎందుకంటే కేవలం నాని తన నటనతో ,కామెడీతో , డైలాగు విరుపుతో చాలా భాగం లాక్కొచ్చాడు. సీన్స్ లో బలం లేక తేలిపోయే చోట కూడా మ్యానేజ్ చేసాడు. కాబట్టి ఇది నాని వన్ మ్యాన్ షో అనే చెప్పాలి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X