twitter

    విమర్శకుల సమీక్ష

    • ఫీల్ గుడ్ సినిమాలు మనకు అప్పడప్పుడూ వస్తూంటాయి కానీ రెగ్యులర్ గా రావు. అయితే శర్వానంద్ మాత్రం అలాంటి చిత్రాలుకు స్వాగతం పలుకుతూనే ఉన్నారు. రన్ రాజా రన్ వంటి కమర్షియల్ హిట్ చిత్రం తర్వాత చేసిన ఈ చిత్రం క్లాస్ ప్రేక్షకులకు బాగుందనిపించేలా...స్లోగా...ఫీల్ తో సా........గింది. ఓ అందమైన ప్రేమ కధగా చిత్రాన్ని తీర్చి దిద్దాలనే దర్శకుడి తాపత్రయం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. ఓ వర్గానికి మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తే...మరికొందరకి ఒక్కసారి చూడటమే కష్టమిపిస్తుంది. ఫస్టాఫ్ రన్ బాగుందనిపించినా సెకండాఫ్ కు వచ్చేసరికి అది మరింత స్లో అయ్యిపోయింది. అక్కడక్కడా సీన్స్ చూస్తూంటే ఏదో మళయాళ చిత్రం చూసినట్లు అనిపించినా సీన్స్ లోని కంటంట్ తో దాన్ని అధిగమిస్తాడు. ఇవన్నీ ప్రక్కన పెడితే నిత్యామీనన్ అభిమానులకు ఇది పండుగ చేసుకునే సినిమానే. ఈ సినిమాలో తన ప్రతిభను మరోసారి సినిమాకు ప్లస్ అయ్యేలా చేసింది. మంచి విజువల్స్ కోసం, చక్కటి డైలాగ్స్ కోసం...కాస్త స్లో అయినా ఫరవాలేదు...మన పాత ప్రేమ కథలను గుర్తు చేసుకుందామనుకునే వారికి ఈ సినిమా మంచి ఆప్షన్.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X