twitter

    విమర్శకుల సమీక్ష

    • నిజానికి ఆర్పీ పట్నాయిక్ ఈ కథ కోసం తీసుకున్న నేపధ్యం, సంఘటనలు చాలా నాచురల్ గా ఉన్నాయి. ఫస్టాఫ్ అంతా కథని సెటప్ చేస్తూ వెళ్లిపోయారు. ముఖ్యంగా విద్యార్థుల గౌరవాభిమానాల్ని చూరగొన్న లెక్చరర్ కృష్ణమూర్తిపై లైంగిక వేధింపుల అభియోగం రావడం ప్రేక్షకుడిని వెంటనే కథలో లీనం చేస్తుంది. అయితేనేం ఆ తర్వాత అంత పగడ్బందీగా కథని నడపలేకపోయారు. ఇలాంటి సినిమాలు పాయింట్ టు పాయింట్ అన్నట్లుగా క్రిస్పీగా ఉంటే బాగుంటాయి. సమాజాన్ని ప్రశ్నించే విధానం నచ్చుతుంది. అంతేకానీ మెల్లిగా అదే పాయింట్ చుట్టూ అదే సీన్స్ రిపీట్ అవుతూంటే ఇబ్బందిగా ఉంటుంది. మనలో ఒకడు..అదే సమస్యను ఎదుర్కొంది. సినిమా ఫస్ట్ టర్న్ తీసుకున్న వద్దనుంచి క్లైమాక్స్ వరకూ ఒకే రకంగా ఎరౌండ్ బుష్ అన్నట్లు సాగుతుంది. ముఖ్యంగా తప్పు ఎక్కడ జరిగింది... అసలు తప్పు ఎవరు చేశారన్నది అందరికీ ముందే తెలిసినప్పటికీ నిందితుడిని పట్టుకొనే ప్రయత్నం చివరిదాకా చేయకపోవడమనేది విసిగిస్తుంది. మన కథా సౌలభ్యం కోసం సీన్స్ అల్లుకుంటూ విషయం ట్రాక్ తప్పించినట్లు అనిపిస్తుంది. కథ సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రి క్లైమాక్స్‌ సన్నివేశాలు సినిమాకి కీలకం. నాజర్‌, సాయికుమార్‌ల మధ్య సన్నివేశాలు సినిమాని అప్పటిదాకా ఉన్న వాటినుంచి మరో స్థాయికి తీసుకెళ్లాయి. అయితే ఊహించని విధంగా చివర్లో .. ఆర్పీ పట్నాయక్‌ వచ్చి మీడియాకి సందేశాన్ని ఇవ్వడం మొదలుపెడతాడు. అదంతా క్లాస్‌ తీసుకొన్నట్టు అనిపిస్తాయి. మూడో కన్ను ఛానల్‌ ప్రతాప్‌ పాత్రలో సాయికుమార్‌ నటన సినిమాకి హైలెట్ గా నిలిచంది. అలాగే పబ్లిసిటీనే మెయిన్ గా .. కనీస అవగాహన లేకుండా ఛానళ్లలో కూర్చుని మాట్లాడే శతావతారం పాత్రలో జయప్రకాష్‌రెడ్డి నవ్విస్తారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X