twitter

    విమర్శకుల సమీక్ష

    • బ్యూటీ అండ్ ది బీష్ట్' ని గుర్తు చేసే ఈ చిత్రం పూర్తిగా ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో సాకే పక్కా పగ-ప్రతీకారం మార్క్ సినిమా. ప్రారంభమే కురూపిగా హీరోని ఓపెన్ చేసి..అతను ఎలా ఎందుకు అయ్యాడు అనే విషయం రివిల్ చేయటం వరకూ స్క్రీన్ ప్లే టెక్నిక్(పాతదే అయినా) బాగుంది. అయితే ఆ ప్లాష్ బ్యాక్... సినిమా మొత్తం ఆక్రమించేసింది. ఫ్లాష్ బ్యాక్ పూర్తయితే కదా.. ప్రెజంట్ లోకి వచ్చి... ఆ ప్లాష్ బ్యాక్ తాలూకూ నీడలను, నిజాలను కనుక్కుని ప్రతీకారం తీర్చుకునేది. అలా కాకుండా ప్రీ క్లైమాక్స్ దాకా ప్లాష్ బ్యాక్ నే సాగతీస్తూ... చెప్తూ పోతే అసలు కథ ఎప్పుడు వింటాం...గతాన్నే పట్టుకుని ఎంత సేపు వేళ్లాడతాం... అలా అనుకుంటే ...శంకర్ గత హిట్ చిత్రాలు చక్కడా టీవీలో చూసుకోకుండా కొత్త చిత్రం చూద్దామనే థియోటర్ కి ఎందుకు వెళతాం..గతం ఎంత గొప్పదయినా...ఇప్పుడు ఏం జరుగుతుందనే దానికే కదా ప్రయారిటీ. ఎందుకనో అంత పెద్ద దర్శకుడూ ఇంత చిన్న విషయాన్ని మర్చిపోయారు. దాంతో హీరో కి లాగానే ..కథకి జబ్బు చేసింది. హీరో కి మెయిన్ విలన్ ఎవరో తెలిసే సరికే సినిమా క్లైమాక్స్ కు వచ్చేస్తే...ఇంక పగ ఎలా తీర్చుకుంటాడు అనేదానికు స్క్రీన్ టైమ్ ఎక్కడుంది. పోనీ ఆ మెయిన్ విలన్ ఎవరనేది తెలుసుకోవటం పెద్ద ట్విస్టా అంటే ...థియోటర్ లో కూర్చున్న చిన్న పిల్లాడు సైతం కనిపెట్టేస్తాడు. అంత వీక్ గా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. కేవలం సాంకేతికంగా, విజువల్ గా వండర్ గా తీర్చిదిద్దాలనే తపన తప్పించి మిగతా విషయాలపై ఆయన దృష్టి పెట్టలేదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X