twitter

    విమర్శకుల సమీక్ష

    • యాక్షన్ చిత్రాల రాజమౌళి ట్రెండ్ మార్చి ఫుల్ లెంగ్త్ కామిడీ తీస్తున్నాట్ట...అదీ సునీల్ ని హీరోగా పెట్టి..ఎలా ఉంటుందో ఏంటో అంటూ గత కొద్ది రోజులుగా ఎక్కడికి వెళ్ళినా ఇది వినపడుతోంది. ఆ టాక్ కి తగ్గట్లుగానే మంచి ఓపినింగ్స్ కూడా మర్యాదరామన్నకి వచ్చాయి. కానీ సినిమాలో ఊహించనంత కామిడీ మాత్రం కరువవటం నిరాశపరిచింది. అయితే ఈ సినిమాకి సంభందించి ఇక్కడో గొప్ప విషయం మాట్లాడుకోవాలి. తెలుగులో కామిడీ సినిమా అనగానే తెరనిండా కామిడీ యాక్టర్లు, రకరకాల సబ్ ప్లాట్లుతో కామిడీ పండించే ప్రయత్నాలు కామన్. అయితే మర్యాదరామన్న తన మర్యాదను పోగొట్టుకోకుండా సినిమా ప్రారంభంలో ఎత్తుకున్న పాయింట్ ప్రక్కకు పోనివ్వకుండా,తెరనిండా కామిడీ నటులును నింపకుండా తెలుగు కామిడీ చిత్రాన్ని రూపొందించారు. ఇక 1923లో వచ్చిన బస్టర్ కీటన్ సైలెంట్ కామిడీ అవర్ హాస్పటిలాటి చిత్రం కథని ఈ కాలానికి ముఖ్యంగా ఫ్యాక్షన్ వాతావరణంలోకి మార్చి కథనం తయారుచేసుకున్న ఈ చిత్రం స్క్రిప్టు లోపమే సెకండాప్ ని డల్ చేసిందనిపిస్తుంది. అయితే హింస, అసభ్యత లేని ఈ చిత్రం, రాజమౌళి ట్రేడ్ మార్క్ తో ప్యామిలీలను రప్పిచే ప్రయత్నం చేస్తుంది. ఇక సునీల్ స్లిమ్ గా మారటమే కాక తనకు అలవాటైన హావభావాలను ప్రక్కన పెట్టి కొత్తగా ట్రై చేసాడు. అయితే సునీల్ ఇంతకు ముందులాగే బొద్దుగా ఉంటేనే చూడగానే నవ్వు వచ్చేదేమో ఒక్కోసారి అనిపించటం ఖాయం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X