twitter
    TelugubredcrumbMoviesbredcrumbMayuribredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఆద్యంతం ఊపిరిబిగపట్టించే సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన దర్శకుడు ప్రేక్షకులకు అసలు సిసలైన హారర్ అనుభూతిని కలిగించాడని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. స్క్రీన్ ప్లే ప్రేక్షకుడు కథలోకి పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అయిపోతూ ఆ 'మాయా' ప్రపంచంలోకి వెళ్లిపోయి, క్యారెక్టర్ల తాలూకు భావోద్వేగాల్ని అనుభవించేలా చేస్తుంది. కథకు తగిన విధంగా రాన్‌ యోహాన్‌ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను మరింత భయానికి గురి చేస్తుంది. మద్య మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. అసలు సిసలైన హారర్ సినిమా అంటే ఇలానే ఉంటుంది నేలా ఉంది. ప్రేక్షకులు కొత్తరకం హారర్‌ ఎక్స్‌పీరియన్స్‌ పొందుతారు.

      అయితే కథను చెప్పే క్రమంలో దర్శకుడు ప్రేక్షకులను కాస్త కన్‌ఫ్యూజ్ చేసాడు. సినిమాలో.... మరో సినిమాను చూపిస్తూ దాన్ని రియాల్టీకి కనెక్ట్ చేసే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలో కొంత సేపు ప్రేక్షకుడు గందరగోళానికి గురవుతాడు. అయితే అసలు విషయం ఏమిటనేది క్లైమాక్స్ లో స్పష్టత వస్తుంది. దీంతో పాటు సినిమా చాలా సాగదీసినట్లు అనిపిస్తుంది. చూపిన సీన్లనే మళ్లీ చూపించడం ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X