twitter
    TelugubredcrumbMoviesbredcrumbMCAbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఓ మై ఫ్రెండ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు వేణు శ్రీరాం మరో ఐదేళ్ల తర్వాత మధ్య తరగతి కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలలతో ఎంసీఏ కథను అల్లుకొన్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించించే నాని కథానాయకుడిగా ఎంపిక చేసుకొన్నాడు. వదిన, మరిది మధ్య రిలేషన్స్‌ను కథకు జోడించాడు. వదిన కోసం మరిది, మరిది కోసం వదిన పడే ఆరాటంతో కథను నడిపించాడు. తొలి భాగంలో కథను ఆసక్తిగా నడిపిన దర్శకుడు.. రెండో భాగంలోకి వచ్చే సరికి తడబడినట్టు కనిపిస్తాడు. నాని, భూమిక, సాయి పల్లవి లాంటి బలమైన పాత్రల మధ్య దర్శకుడు కొంత నలిగిపోయాడనే చెప్పవచ్చు. అన్ని పాత్రల్లో సమతూకం పాటించడానికి నానా కష్టాలు పడి రెండో భాగంలో గందరగోళానికి గురయ్యాడనిపిస్తుంది. ఇక శివ విలన్ పాత్ర మధ్యలో అతికించినట్టుగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఆ పాత్రకు విజయ్ లాంటి వ్యక్తి ఎంచుకోవడం కొంత మైనస్‌గానే ఉంటుంది. బలమైన విలన్ ఉంటే స్టోరీ ఫ్లేవర్ తగ్గుతుందనే భావనతో విలన్ పాత్రను అండర్ ప్లే చేశాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్‌గా సెకండాఫ్‌లో రొటీన్ సీన్లు, బలహీనమైన కథనంతో అందరిని సంతృప్తి పరిచే శుభం కార్డు వేయడానికి నానా కష్టాలే పడ్డాడానే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వస్తాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X