twitter

    విమర్శకుల సమీక్ష

    • సినిమా కొన్నిచోట్ల సాగ‌దీసిన‌ట్టు ఉంది అయితే కేవల కామెడీ ప్రధానం గా, ఎంటర్టైన్ మెంట్ కోసం మాత్రమే చూడాలి తప్ప స‌ర‌దాగా సాగిపోయే ఈ చిత్రంలో లాజిక్కులు వెతకటం వృధా ప్రయాస. ఇంత‌కు ముందు ప‌లు తెలుగు చిత్రాల్లో చూసిన పాత ఫార్ములాతో కాస్త కామెడీ, కొన్ని స్పూఫ్ లతో అల్లుకున్న క‌థే ఇది. సంతోషానికి, ఆనందానికి తేడా తెలుసుకోవ‌డానికి ఓ వ్యాపార‌వేత్త ప‌దికోట్లు న‌ష్ట‌పోవ‌డానికి సిద్ధ‌మ‌వ‌డ‌మ‌నే కాన్సెప్ట్ అంత తేలిగ్గా మింగుడుప‌డ‌దు. తెలుసా... అనే పాట త‌ప్ప మిగిలిన పాట‌లు కానీ, ట్యూన్లు కానీ పాడుకునేలా అనిపించ‌వు. పాట‌ల‌న్నీ సినిమాలో రావాలి కాబ‌ట్టి వ‌చ్చిన‌ట్టు అనిపిస్తాయి. కాలేజీ స‌న్నివేశాలు కొన్ని, హీరోని ప్రేమ‌లోకి దించ‌డానికి హీరోయిన్ చేసే ప్ర‌య‌త్నాలు కొన్ని ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. పంచ్ డైలాగులు విన‌డానికి బాగానే ఉన్నా కొన్ని చోట్ల ఆయా సీన్‌లు అంత భారాన్ని మోయ‌లేక‌పోయాయ‌న్న‌ది వాస్త‌వం. స్క్రీన్ ప్లే మాత్రం పెద్ద మైనస్ అనిప్స్తుంది. పేరుకు నవీన్ చంద్ర హీరో అయినా.. సినిమా అంతా పృథ్వీనే హీరోగా కనిపిస్తాడు. తనకు బాగా అలవాటైన పేరడీ సీన్స్తో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్తో పాటు పంచ్ డైలాగ్స్తోనూ అలరించాడు. సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత తాతారావు పాత్రకు పోసాని కృష్ణమురళి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. రఘుబాబు, పోసాని కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ కితకితలు పెడతాయి. ఈ చిత్రంలో ఆనందానికి, సంతోషానికి తేడాను చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అలాగే కామానికి, శృంగారానికి, ప్రేమ‌కు తేడా ఉంటుంద‌నే విష‌యాన్ని కాసింత గ‌మ‌నించి ఉంటే బావుండేది. ఇటువంటి ఒక‌టీరెండు స‌న్నివేశాల వ‌ల్ల ప్రేమ అనే ప‌దానికి త‌ప్పుడు అర్థం వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌న్న‌ది గ్ర‌హించి ఉండాల్సింది. ఇక మొత్తానికి ఒక మాటగా చెప్పాలీ అనుకుంటే కామెడీ అనే దృష్తిలో మాత్రమే చూడాలనుకున్న వారికి పూర్తి సంతృప్తినిచ్చే సినిమా ఇది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X