twitter

    మీలో ఎవరు కోటీశ్వరుడు స్టోరి

    మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమా కామిడి రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవీన్‌చంద్ర, శృతి సోధి, పృథ్వీ, సలోని, జయప్రకాష్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్‌, పిల్లా ప్రసాద్‌, గిరి, సన, విద్యుల్లేఖా రామన్‌, మీనా, నేహాంత్‌ తదితరులు ముఖ్యపాత్రలు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఇ సత్తిబాబు నిర్వహించారు మరియు నిర్మాత కె కె రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీవసంత్ స్వరాలు సమకుర్చరు.

    కథ

    రైతు (చ‌ల‌ప‌తిరావు) కొడుకు ప్ర‌శాంత్ (న‌వీన్ చంద్ర‌). బిజినెస్ ఐకాన్ ఏబీఆర్ (ముర‌ళీ శ‌ర్మ‌) కుమార్తె ప్రియ (శ్రుతిసోది). ప్రశాంత్(నవీన్ చంద్ర) ఓ సిన్సియర్ స్టూడెంట్. కాలేజ్ టాపర్ అయిన ఈ కుర్రాడికి ఓ రోజు అర్థరాత్రి ఫుల్గా తాగేసి.. కారును డివైడర్కు గుద్దేసిన ప్రియా(శృతిసోథీ) కనిపిస్తుంది. ప్రియా పరిస్థితిని చూసి తానే వెళ్లి ఇంట్లో దిగబెట్టి వస్తాడు ప్రశాంత్. ఓ అమ్మాయి అలాంటి పరిస్థితుల్లో కనిపించినా.. ఏ మాత్రం అడ్వాంటేజ్ తీసుకోకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చిన ప్రశాంత్తో ప్రేమలో పడుతుంది ప్రియా అంత‌స్తుల తేడాను అర్థం చేసుకున్న ప్ర‌శాంత్ ఆమెకు దూరంగా ఉండాల‌నుకుంటాడు. అయితే ఆమె అభ్య‌ర్ధ‌న మేర‌కు త‌మ ప‌ల్లెటూరికి తీసుకెళ్తాడు. కోటీశ్వ‌రుల కూతురు త‌మ ఇంట్లో అంద‌రితో క‌లివిడిగా ఉండ‌టం చూసి మ‌న‌సుప‌డ‌తాడు. వీరి ప్రేమ‌ను ఏబీఆర్ అంగీక‌రించ‌డు. తన ఆస్తి కోసమే ప్రియను ప్రేమలో పడేశావని ప్రశాంత్ని అవమానిస్తాడు.అప్పుడు ప్ర‌శాంత్ ఓ చిక్కుముడి వేస్తాడు. డబ్బుతో ఆనందం రాదని, కావాలంటే మీరు ఒక్కసారి ఏదైన బిజినెస్ చేసి నష్టపోయి చూడండి తరువాత మీకు ఆనందం విలువ ఏంటో తెలుస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. అప్పటి వరకు ఏ బిజినెస్లోనూ నష్టపోని ఏబీఆర్, నష్టాలు తెచ్చిపెట్టే బిజినెస్ ఐడియా ఇవ్వమని పేపర్ ప్రకటన ఇస్తాడు. అలాంటి ఐడియా ఇచ్చిన వారికి కోటి రూపాయల బహుమతి ప్రకటిస్తాడు. స్టార్ హీరోలతో సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత తాతారావు(పోసాని కృష్ణమురళి) ఆ ప్రకటన చూసి ఏబీఆర్ను కలుస్తాడు. తాను ఓ ఫ్లాప్ సినిమా తీసి పెడతానని దాంతో భారీగా నష్టం వస్తుందని ప్రామిస్ చేస్తాడు. దానికి స‌మాధానం వెతుక్కునే ప్ర‌య‌త్నంలోనే థ‌ర్టీఇయ‌ర్స్ పృథ్విని పెట్టి `త‌మ‌ల‌పాకు` అనే సినిమాను చేస్తాడు ఏబీఆర్‌. ఆ సినిమాలో మ‌హేశ్ (పృథ్వి), స‌మంత (స‌లోని) అనే పాత్ర‌లు అంద‌రికీ న‌చ్చుతాయి. ఆ సినిమాను తీసిన నిర్మాత తాతారావు(పోసాని కృష్ణ‌ముర‌ళి)కు, ద‌ర్శ‌కుడు రోల్డ్ గోల్డ్ ర‌మేశ్ (ర‌ఘుబాబు)కు మంచి పేరు వ‌స్తుంది. ఇంత త‌తంగం త‌ర్వాత ఏబీఆర్ త‌న కూతురు ప్రేమ విష‌యంలో ఓ నిర్ణ‌యం తీసుకుంటాడు. అదేమిటన్న‌ది క్లైమాక్స్.

    **Note:Hey! Would you like to share the story of the movie మీలో ఎవరు కోటీశ్వరుడు with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X