మెహబూబా (2018)(U/A)
Release date
11 May 2018
genre
మెహబూబా స్టోరి
మెహబూబా సినిమా 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ఇందులో ఆకాష్ పూరీ, నేహా శేట్టి ప్రధాన పాత్రాలలో ఇంగా విషు రెడ్డి, మురలి శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని పూరి జనన్నాధ్ తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సందీప్ చౌతా అందించారు.
కథ
రోషన్ ( ఆకాష్ పూరీ) అమితమైన దేశభక్తి కలిగిన యువకుడు. సైన్యంలో చేరాలనే తపనతో ఉంటాడు. స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ చేయడమంటే చాలా ఇష్టం. కానీ చిన్నతనం నుంచే కొన్ని జ్ఞాపకాలు రోషన్‌ను వెంటాడుతుంటాయి. హిమాలయాలతో తనకు అవినాభావ సంబంధం ఉందనే భావనతో ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో చదువుకోవడానికి వచ్చిన పాకిస్ఠానీ అమ్మాయి అఫ్రీన్ (నేహా శెట్టి) పరిచయం అవుతుంది. ఓ సందర్భంలో ఆఫ్రీన్‌ను రక్షిస్తాడు. ఆ తర్వాత ఏదో చెప్పలేని బంధం తమ మధ్య ఉందనే ఫీలింగ్ ఇద్దరిలోనూ ఏర్పడుతుంది. ఈ క్రమంలో హియాలయాలకు వెళ్లిన రోషన్‌కు ఆఫ్రీన్ రూపంలో ఉన్న ఓ అమ్మాయి శవం మంచు కొండల్లో లభ్యమవుతుంది. అప్పుడు ఆఫ్రీన్ డైరీలో లభ్యమైన సమాచారం ఆధారంగా తమది గత జన్మ బంధమని తెలుసుకొంటాడు.
గత జన్మలో కబీర్, మధీరా ప్రేమ అసంపూర్తిగా ముగిసిపోయిందని తెలుసుకొంటాడు. మధీరానే తన ప్రేయసి అఫ్రీన్‌గా గుర్తిస్తాడు. పాకిస్థాన్‌కు వెళ్లిపోయిన అఫ్రీన్కు పెళ్లి నిశ్చయమవుతుంది. ఈ జన్మలోనైనా తన ప్రేమను రక్షించుకోవడానికి రోషన్ పాకిస్థాన్‌కు వెళ్లాడు. పాకిస్థాన్‌కు వెళ్లిన రోషన్ తన ప్రేయసిని ఎలా దక్కించుకొన్నాడు. ఆఫ్రీన్ ప్రేమను కాపాడుకోవానికి రోషన్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. గత జన్మలో కబీర్, మధీరా ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడ్డాయి. వాళ్లు ఏవిధంగా ప్రాణాలు కోల్పోయారు అనే ప్రశ్నలకు సమాధానమే మెహబూబా చిత్ర కథ.
**Note:Hey! Would you like to share the story of the movie మెహబూబా with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు