twitter

    విమర్శకుల సమీక్ష

    • గ్రామీణ నేపథ్యంతో లవ్, ఎమోషన్స్ స్కోప్ ఉన్న పాయింట్ ఎంచుకోవడమే కాకుండా దర్శకుడు వెంకట్ వందెల , యూత్‌ఫుల్‌ ఎంటర్‌‌టైన్‌మెంట్‌‌గా మలిచే ప్రయత్నం అభినందనీయం. కొత్త, పాత నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకొన్నారు. కథ, కథనాలపై మరికొంత కసరత్తు చేసి ఉంటే మంచి ప్రేమకథా చిత్రం అయి ఉండేది. సినిమాటోగ్రాఫర్ వంశీ ప్రకాశ్‌ అందించిన కెమెరా వర్క్ బాగుంది. సందీప్ మ్యూజిక్ సన్నివేశాలను మరింత బలంగా మార్చింది. నందమూరి హరి ఎడిటింగ్, గణేష్ మాస్టర్, సందేపు రమేష్ కొరియోగ్రఫి బాగుంది. రాజ‌ధాని ఆర్ట్ మూవీస్, జీవీఆర్ ఫిల్మ్ మేక‌ర్స్‌పై ముల్లేటి నాగేశ్వ‌రావు, ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు నిర్మించిన నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా మూవీలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను రిచ్‌గా మలచడానికి చేసిన ప్రయత్నం సినిమాపై వారికి ఉన్న అభిరుచి తెలియజేసింది. రూరల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందే ప్రేమ కథలను ఇష్టపడేవారికి నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా మూవీ తప్పకుండా నచ్చుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X