twitter

    విమర్శకుల సమీక్ష

    • కోడి రామకృష్ణ ఈ సారి ఎందుకనో బలమైన కథ, కథనం పైన కన్నా ఎక్కువగా గ్రాఫిక్స్ పై దృష్టి పెట్టారు. కథలేని గ్రాఫిక్స్ రాణించవు అని ఆయనే ఎన్నోసార్లు గతంలో చెప్పి ఉన్నారు. కానీ ఆ బేసిక్ రూల్ ని ఆయనే మరిచి ఈ సినిమాని మలిచారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో కన్నడ సూపర్‌స్టార్‌ విష్ణువర్ధన్‌ని గ్రాఫిక్స్‌ రూపంలో సృష్టించి చూపించమే ఈ సినిమాకు నిజానికి హైలెట్. ఒక నటుడిని గ్రాఫిక్స్‌ రూపంలో రీక్రియేట్ చేసేనప్పుడు ఎంతటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సినిమా చెబుతుంది. . కథా పరంగా ఓకే అనిపించినా..స్క్రీన్ ప్లే విషయంలో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోవటంతో టార్చల్ లాగ తయారైంది. క్లైమాక్స్ పార్ట్‌లో దివంగత కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా ఆవిష్కరించాలని చేసిన ఆలోచన ని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్ట్ తీసేస్తే ఇది అతి సాధారణమైన రొటీన్ సినిమా. కన్నడంలో ఓ రేంజిలో ఓపినింగ్స్ వచ్చాయంటే ఆ ఐడియావల్లే. నాగ‌భ‌ర‌ణం ఇంట్రడక్షన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రారంభమైన ఐదు నిమిషాలు త‌ర్వాత సినిమా ఎటు వెళ్తూందో అర్దం కాదు. ఒక సీన్ కు మరొక సీన్ కు పొంతన కనపడదు. ముఖ్యంగా ఫ‌స్టాఫ్‌లో హీరో, హీరోయిన్ మ‌ధ్య స‌న్నివేశాలు, ఫ్యామిలీ డ్రామా స‌రిగా పండ లేదు. ఇక సెకండాఫ్‌లో నాగ‌మ్మ ప్లాష్‌బ్యాక్ చూస్తే అరుంధ‌తి స్ఫూఫ్ లా అనిపిస్తుంది. ముఖ్యంగా నాగ‌మ్మ వంటి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ను ర‌మ్య స‌రిగా హ్యాండిల్ చేయ‌లేకపోవటం మైనస్ గా నిలిచింది. ఇక దుష్ట‌శ‌క్తులు క‌ల‌శం గురించి చేసే చేసే విన్యాసాలు ఇంట్రస్ట్ కలిగించకుండా, విసుగును తెప్పిస్తాయి. సినిమా హైలెట్స్ చెప్పాలంటే ఇంటర్వెల్ అప్పుడు ఒక పెద్ద పామును వీఎఫ్‌ఎక్స్‌లో సృష్టించిన విధానం, క్లైమాక్స్‌లో చనిపోయిన ఒక సూపర్ స్టార్‌ను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా ఆవిష్కరించడం వంటివి బాగున్నాయి. సినిమా ఉన్నంతలో గిట్టుబాటు అయ్యేలా చేసాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X