twitter
    TelugubredcrumbMoviesbredcrumbNagarambredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • అనేక సమస్యలో కూరుకుపోయిన నగరం నుంచి వెళ్లి పోవాలనుకున్న సందీప్ కిషన్ మళ్లీ మనసు మార్చుకోవడం, అలాగే పల్లెటూరు నుంచి ఉద్యోగం కోసం వచ్చిన శ్రీ నగరం వల్ల ఒరిగేది ఏమిలేదు. ఊరే మంచిది అనే భావన నుంచి బయటపడి నగరమే మంచిది అనే ఫీలింగ్ కల్పించిన సన్నివేశాలు దర్శకుడి పనితీరుకు అద్దం పట్టాయి. ఉన్న ఊరిలోనే ఉండటం మానసికంగా స్థైర్యమని సందీప్ చేత, ఎవరో నలుగురి వల్ల కలిగిన ఇబ్బందులతో నగరంపై చెడు అభిప్రాయాన్ని కలిగించుకోవడం అని చెప్పిన అంశాలు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతాయి. పిల్లాడి కిడ్నాప్ డ్రామాలో మాఫియా డాన్, రౌడీ మూకల మధ్య జరిగే ఎత్తులు పైఎత్తులు యాక్షన్ ప్రేమించే ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయి. కుమారుడి కోసం డాన్ పడే తపన‌తో మంచి సెంటిమెంట్ వర్కవుట్ అయింది.

      ఇలాంటి అనేక ప్రత్యేకతలతో రొటీన్‌కు భిన్నంగా ఉన్న చిత్రమనే అభిప్రాయం ప్రేక్షకుడికి ఈ చిత్రం కల్పిస్తుంది. మూస చిత్రాలను కాకుండా డిఫరెంట్ చిత్రాలను ఆశించే ఆడియెన్స్‌కు నగరం చిత్రం ఫుల్ మీల్స్ లాంటింది. అంతేకాకుండా పైసా వసూల్ సినిమా అని బల్ల గుద్ది చెప్పవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X