twitter

    విమర్శకుల సమీక్ష

    • రామారావుగా సందీప్ కిషన్ పోలీసు ఉద్యోగం పొందడానికి పడిన కష్టాలను, సినిమాల్లో డ్యాన్సర్‌గా రాణించాలనే కోరిక ఉన్న జమున (రెజీనా) ఇతర పాత్రల పరిచయంతో సినిమా గడిచిపోతుంది. డ్రగ్స్ అలవాటు పడిన తనీష్ విలనిజం, మాఫియా కార్యక్రమాలతో అలా ఇంటర్వెల్ వరకు సినిమాను దర్శకుడు కృష్ణవంశీ బలవంతంగా లాక్కొస్తాడు. ఇక ఇంటర్వెల్‌లో అలెగ్జాండర్ పాత్రను తీసుకొచ్చి ప్రేక్షకులకు ఓ ట్విస్ట్ ఇస్తాడు. దాంతో రెండో భాగంలో అలెగ్గాండర్ పాత్రపై ప్రేక్షకులకు ఆసక్తి కల్పించడంలో కృష్ణవంశీ తన ప్రతిభను చూపాడు. తీరా సెకండాఫ్ మొదలైన తర్వాత కథ చాలా పేలవంగా సాగడం, సన్నివేశాలు, డైలాగ్స్‌లో దమ్ము లేకపోవడంతో సినిమా పరిస్థితి ఏంటో అప్పుడే తేలిపోతుంది. తనీష్ విలనిజం కాస్త కొత్తగా అనిపించడం సెకండాఫ్‌లో కొంత ఊరటలా ఉంటుంది. ఫస్టాఫ్‌లోను, సెకండాఫ్‌లోను రొటీన్ ఫార్మూలాతో విసుగు పెట్టించాడు దర్శకుడు. కథ ఏం చెప్పాలనుకొంటున్నాడో ఓ పట్టాన అర్థం కాదు. ఎంత సేపు పాత్రల చుట్టూ.. అనవసరంగా మధ్యలో పాటలను జొప్పించి సినిమాను చాలా నాసిరకంగా చుట్టేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. 24 విభాగాల్లో ఏ ఒక్క విభాగం ప్రతిభ ఆకట్టుకొనే విధంగా లేకపోవడం ఈ సినిమా పరిస్థితికి అద్దం పట్టింది. ఓవరాల్‌గా రెజీనా, ప్రగ్యా జైస్వాల్ అందాల ఆరబోత, కొంతలో కొంత తనీష్ విలన్ పాత్ర ప్రేక్షకుడికి ఊరటను కలిగిస్తాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X