twitter

    విమర్శకుల సమీక్ష

    • కొన్ని కాన్సెప్టులు వినటానికి విచిత్రంగా ఉంటాయి. అరే ఇలాంటి కథలు కూడా సినిమాలు చేస్తారా అనే డౌట్ వస్తుంది. అయితే ఆ విచిత్రంగా అనుకున్న కథలే ఒక్కోసారి హై సక్సెస్ ని తెచ్చిపెడతాయి. అదే బాలీవుడ్ లో జరిగింది. తెలుగు కు వచ్చేసరికి మరి ఆ స్దాయి సక్సెస్ వస్తుందా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రేక్షకులు వేరు. వీరికి మరికాస్త సున్నితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి విక్కీ డోనర్ చిత్రం ఎక్కువగా ఆడింది మల్టిఫ్లెక్స్ లలో . ఓ స్దాయి ఆడియన్స్ కు అది నచ్చింది, హిట్ చేసి వదిలారు. అదే తెలుగుకు వచ్చేసరికి ఇక్కడ కూడా అదే స్దాయి ప్రేక్షకులకు అర్దం చేసుకునే కథ. అయితే ఇక్కడ మల్టిఫ్లెక్స్ లలో ఇలాంటి సినిమాలు చూసే ఆసక్తి ఉన్నవాళ్లు ఆల్రెడీ హిందీలో చూసేసారు. సినిమాలో కీలకమైన ఎమోషన్ హీరో హీరోయిన్లు విడిపోయే సీన్ లో వస్తుంది. అయితే దాన్ని ఇంకాస్త ఎఫెక్టీవ్‌గా చెప్పాల్సింది అనిపించటం ఖాయం. అప్పుడే సెకండాఫ్ లో పండే డ్రామాకి ఇంకాస్త బాగా కనెక్ట్ అయ్యేది. ఫస్టాఫ్ మొత్తం తొలిభాగం కేవ‌లం స్పెర్మ్ డొనేష‌న్‌పై.. సెకండాఫ్ మొత్తం భార్యా భ‌ర్త‌లు విడిపోవ‌డం, కలవటం పై సాగుతాయి. కాబ‌ట్టి చూసిన సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది చాలా చోట్ల. బాలీవుడ్‌ చిత్రాన్నీ.. అందులో పాత్రల్నీ మక్కీకి మక్కీ దించే ప్రయత్నం జరిగటంతో... ‘విక్కీ డోనర్‌' చూసిన వాళ్లకు ఈ సినిమా కాపీ పేస్ట్‌లానే ఉంటుంది. అయితే హిందీలో చూడని తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ కథా నేపథ్యం కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తూంటే లెంగ్త్ ఎక్కువైందనిపిస్తుంది. మ‌రో 20 నిమిషాల్ని ట్రిమ్ చేస్తే...విషయం మరింత బాగా కనెక్టు అవుతుంది. అలాగే పెళ్లి చూపుల సీన్‌లో య‌మ‌హా న‌గ‌రి.. అంటూ హీరో పాట అందుకోవ‌డం.. వంటి కొన్ని స‌న్నివేశాలు మ‌రీ లెంగ్తీగా ఉండ‌డం విసుగు తెప్పిస్తాయి. ముఖ్యంగా పిల్లలు లేని తల్లుల ఆవేదనను పోట్రెయిట్ చేసి ఉంటే సినిమాకు డెప్త్ వచ్చేది. అయితే క్లైమాక్స్ సీన్స్ డీల్‌ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X