twitter

    విమర్శకుల సమీక్ష

    • బాహుబలి ముందు వరకు రానా అంటే నటనలో పెర్ఫెక్షన్ లేని సాధారణ నటుడు. అయితే బాహుబలి సినిమా చేసిన అనుభవమో? లేక ఇన్నేళ్ల యాక్టింగ్ ఎక్స్‌పీరియన్సో తెలియదు కానీ.... ‘జోగేంద్ర' పాత్రలో నట విశ్వరూపం చూపాడు. లవ్ సీన్స్, యాక్షన్ సీన్స్, పొలిటికల్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, విలనిజం ప్రదర్శించే సీన్స్.... ఇలా ఏ సీన్ చూసినా రానా పెర్ఫార్మెన్స్ సూపర్బ్. జోగేంద్ర భార్య రాధ పాత్రలో కాజల్ మంచి పెర్పార్మెన్స్ ఇచ్చింది. తెలుగింటి ఆడపడుచులా అందంగా కనిపించింది. హీరోయిన్ కేథరిన్ జర్నలిస్టు పాత్రలో పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకోవడంతో పాటు తన సెక్సీ ఆల్ట్రా గ్లామర్ లుక్ తో ప్రేక్షకుల మతి పోగొట్టింది.

      అనూప్ రూబెన్స్ సంగీతం, బ్యాగ్రౌడ్ స్కోర్ కథకు తగిన విధంగా, స్క్రీన్ ప్లేను మరింత ఎలివేట్ చేసే విధంగా బావుంది. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ గుడ్. కోట గిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఓకే. సురేష్ ప్రొడక్షన్స్-బ్లూ ప్లానెట్ ఎంటర్టెన్మెంట్స్ నిర్మాణ విలువలు బావున్నాయి.

      చాలా కాలంగా అసలు ఫాంలో లేని తేజ.... కాస్త గ్యాప్ తీసుకున్నా అదిరిపోయే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తేజ రాసుకున్న కథలో కొత్తదనం లేక పోయినా, సినిమాను నడిపించే తీరు గొప్పగా లేక పోయినా.... ఆ లోపాలన్నింటినీ జోగేంద్ర పాత్రను హ్యాండిల్ చేసిన తీరుతో పూడ్చేశాడు. రానా నుండి తనకు కావాల్సిన పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X