twitter

    నేనే రాజు నేనే మంత్రి స్టోరి

    నేనే రాజు నేనే మంత్రి సినిమా పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ ఇందులో రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, కేథరిన్ త్రెసా, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి, రఘు కరుమంచి, ప్రభాస్ శ్రీను, బిత్తిరి సత్తి, శివాజి రాజా, జోస్ రవి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తేజా వహించారు మరియు నిర్మాత సురేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రుబేన్స్ అందించారు.

    కథ

    జోగేంద్ర (రానా) న్యాయంగా వడ్డీ వ్యాపారం చేసుకునే ఒక సాధారణ యువకుడు. జోగేంద్ర భార్య రాధ (కాజల్). జోగేంద్రకు తన భార్య అంటే చచ్చేంత ప్రేమ. లేక లేక రాధకు కడుపు పండుతుంది. అయితే గ్రామంలోని గుడి వద్ద దీపం వెలిగించే విషయంలో జరిగిన గొడవలో సర్పంచ్(ప్రదీప్ రాత్) భార్య వల్ల రాధ కింద పడి గర్భం పోగొట్టుకుంటుంది. రాధ కోసం సర్పంచిగా గెలిచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జోగేంద్ర హత్యలు, కబ్జాలు ఇలా రాజకీయంగా ఎదగడానికి ఎన్ని చేయాలో అన్ని చూస్తూ ఎంఎల్ఏ, మంత్రి పదువుల చేపట్టి చివరకు సొంత పార్టీ పెట్టి సీఎం కుర్చీ కోసం పోటీ పడే స్థాయికి వెళతాడు. అయితే రాజకీయ కుర్చీలాటలో పడి చివరకు రాధ కూడా ఛీ కొట్టే పరిస్థితి వచ్చిన జోగేంద్ర..... రాజకీయ ప్రత్యర్థులు ఆడిన ఆటలో తన భార్యను పోగొట్టుకుంటాడు. మరి రాధ కోసమే సర్పంచి స్థాయి నుండి సీఎం కుర్చీ వరకు వచ్చిన జోగేంద్ర అపుడు ఏం చేశాడు? ఉరి శిక్ష వరకు జోగేంద్రను తీసుకెళ్లిన పరిస్థితులు ఏమిటి? చివరకు ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.







    **Note:Hey! Would you like to share the story of the movie నేనే రాజు నేనే మంత్రి with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X