ఎంత కామెడీ కథ అయినా ఎక్కడో చోట చిన్న ఎమోషనల్ ప్లే లేకపోతే సినిమా కనెక్ట్ అవటం కష్టం. అదే మిస్సయ్యారనిపించింది . ఇడియట్, ఆర్య చిత్రాలను అల్లినట్లున్న ఈ కథ ని కూడా కాస్త సీరియస్ గా తీసుకుని డైలాగులు అంత గొప్పగా రాసుకుని ఉంటే ఖచ్చితంగా మరో భలే భలే మొగాడివోయ్ అయ్యేది. అలాగని ఈ సినిమా తీసిపారేసేది కాదు కానీ నాని సినిమా అని ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని వెళ్లేంత గొప్పగా ఒకే అమ్మాయిని ఇద్దరు కుర్రాళ్లు ప్రేమించటం. బుద్దిమంతుడు, పద్దతైన కుర్రాడుకి తన కూతురుని ఇవ్వాలని తండ్రి కోరుకోవటం, ఫైనల్ గా కూతురు కోరిక మేరకు ఇష్టపడిన కుర్రాడివైపే మ్రొగ్గు చూపటం. దాదాపు ఎన్నో సార్లు ఇండియన్ స్క్రీన్ పై తెరకెక్కిన కథే ఇది. అలాగని ట్రీట్ మెంట్ లో ఏమన్నా కొత్త దనం చూపాలా అది నిల్లే.
ఇక ఈ సినిమాకు కథ రొటీన్ అనిపించినా ట్రీట్ మెంట్ అయినా సరిగ్గా చేసి ఉండాల్సింది. ఫస్టాఫ్ ఫన్ తో నడిచిపోయినా..సెకండాఫ్ మాత్రం డల్ అయ్యిపోయింది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే చాలా సీన్స్ కేవలం ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అన్నట్లుగా..కేవలం సినిమా రన్ టైమ్ ని పెంచటానికే పనికొచ్చాయంటే అతిశయోక్తి కాదు. వాటిని తీసేసినా కథలో చిన్నపాటి మార్పు కూడా రాదు. అలాగే చాలా ప్రెడిక్టుబుల్ గా కథనం నడిచింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సాగతీతగా మారాయి.