విమర్శకుల సమీక్ష

  • గతంలో చాలా పొరపాట్లు జరిగాయి....ఈసారి వాటిని రిపీట్ కానివ్వండా జాగ్రత్తపడ్డాం ..అని దర్శక,నిర్మాతలు లేదా హీరో కొత్త సినిమా మొదలెట్టినప్పుడల్లా చెప్పటం..దాంతో ఈ సారి ఏదో అద్బుతం జరుగుతుందని ఎదురుచూడటం...సినిమా చూసాక వాళ్లు చెప్పింది నిజమే...ఈసారి పాతవి లేవు కానీ కొత్త పొరపాట్లు దొర్లాయి అనుకోవటం రొటీన్ అయ్యిపోయింది. కొత్త కథతో, చాలా సహజత్వంతో వచ్చానని రామ్ ...తన గత చిత్రాలు రొటీన్ వి కొట్టిపారేస్తూ చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా చూసాక...అది రొటీన్ డైలాగులో భాగంగా చెప్పాడే కానీ రొటీన్ కథను మాత్రం వదలలేదని స్పష్టమవుతుంది. ఫస్టాఫ్ ఓకే అనిపించుకున్నా సెకండాఫ్ చాలా ప్రెడిక్టబుల్ గా కనిపిస్తుంది. అయితే ఈ సినిమాతో ఓ సుఖం ఉంది. నెక్ట్స్ సీన్ ఫలానాది అని మీరు ఊహించనవి అన్నీ అక్షరాలా జరిగి..మీరూ ఓ సినిమా కథకుడు అవ్వచ్చు అనే ధైర్యాన్ని ఈ సినిమా ఇస్తుంది. అయితే రొటీన్ సినిమాలకు పరమ రొటీన్ గా అలవాటు పడినవాళ్లకు రొటీన్ గా ఫరవాలేదు ..బాగుంది అనిపించినా ఆశ్చర్యంలేదు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X