twitter

    విమర్శకుల సమీక్ష

    • హీరో ఆది పడే కష్టాలతో నెక్ట్స్ నువ్వే చిత్రం ప్రారంభమవుతుంది. తనకు వారసత్వంగా వచ్చిన ప్యాలెస్‌లోకి ప్రవేశించి దానిని రిసార్టుగా మార్చడం, ఆ తర్వాత దానిలో వచ్చిన గెస్టులు మృత్యు బారిన పడటంతో కథ వేగం పుంజుకొంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు రొటీన్‌గా సీన్లు కొంత అసహనం కలిగించేలా ఉంటాయి. ఇంటర్వెల్ పాయింట్‌లో ఓ టిస్ట్ ఇవ్వడంతో రెండో భాగంలో ఆసక్తి పెరుగుతుంది. కథలో ముడి విప్పడానికి రెండో భాగంలో కాస్త ఎక్కువ సమయమే తీసుకొన్నప్పటికీ.. అవసరాల శ్రీనివాస్ ఎపిసోడ్‌తో కొంత ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత ఎప్పటిలానే రొటీన్ సీన్లు విసుగు పుట్టిస్తాయి. కథలో వేగం తగ్గుతుంది. క్లైమాక్స్ కోసం సన్నివేశాలను సాగదీసినట్టు ఉంటాయి. కాకపోతే కామెడీతో ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసేందుకు మంచి ప్రయత్నమే చేశాడు. కాకపోతే కొత్త తరహా సీన్లు ఉండి ఉంటే హారర్ సినిమాల్లో నెక్ట్స్ నువ్వే మరోస్థాయి చిత్రంగా మారే అవకాశం ఉండేది. పాత్రలు వచ్చిపోతూ కనిపిస్తాయి గానీ వాటిలో పెద్దగా క్లారిటీ కనిపించదు. లాజిక్కులు ఉండవు. కథలో కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకు ప్రధాన లోపం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X