విమర్శకుల సమీక్ష

  • నిన్ను కోరి సినిమా పల్లవి, అరుణ్ వివాహ వార్షికోత్సవంతో ప్రారంభమవుతుంది. వారి మధ్య ఉన్న ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు చకచకగా సన్నివేశాల రూపంలో సాగిపోతాయి. కానీ తన ప్రేమికుడు నాని కష్టాల్లో ఉన్నాడని తెలుసుకొన్న నివేదా భర్త ఆదికి చెప్పకుండా అక్కడకు వెళ్తుంది. అక్కడే ప్రేక్షకుడికి ట్విస్ట్ ఇస్తాడు దర్శకుడు. అక్కడి నుంచి కథ అమెరికా నుంచి వైజాగ్‌కు చేరుకొంటుంది. తొలిభాగంలో నాని, నివేద ప్రేమ, వారి రొమాన్స్ చక్కగా చిత్రీకరించాడు. ఓ కారణంగా తన కెరీర్‌ కోసం ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడిన నాని ఢిల్లీకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత నివేద, ఆదిల పెళ్లి జరిగిపోవడం లాంటిని మంచి కథనంతో సినిమా పరుగులు పెడుతుంది. ఇంటర్వెల్ ముందు సీన్‌లో నివేదా, ఆది ఇంటికి నాని చేరుకోవడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. రెండో భాగంలో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. నివేదా, ఆది ఎప్పుడు విడిపోతాడా అని నాని ఎదురు చూస్తుంటాడు. తమ ప్రేమను చూసి నాని ఎప్పుడు రియలైజ్ అవుతాడు అని నివేదా ఆది చూస్తుంటాడు. ఇలా మూడు పాత్రల మధ్య సంఘర్షణతో సినిమా సాగుతుంటుంది. కానీ రొటీన్ కథకు ఎలాంటి నావెల్ ట్రీట్‌మెంట్ లేకపోవడంతో సినిమా నత్త నడకన సాగినట్టు అనిపిస్తుంది. సినిమాను క్లైమాక్స్ వరకు లాగడానికి అమెరికాలో బ్రేకప్ వ్యవహారాలకు సంబంధించిన రెండు ఏపిసోడ్స్‌తో కాలక్షేపం జరుగుతుంది. కానీ కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్ లేకపోవడంతో చాలా రొటీన్ వ్యవహారంగా సాగిపోతుంటుంది. ఓ దశలో ఇదే గొడవరా బాబు అనే ఫీలింగ్ కలుగుతుంది. చివరకు రొటీన్ ముగింపుతో నిన్ను కోరి ముగియడంతో ప్రేక్షకుడు ఊపిరి పీల్చుకోవడం జరుగుతుంది. చాలా రొటీన్ కథకు నాని, నివేదా, ఆది, మురళీశర్మ లాంటి టాలెంటెడ్ నటులతో సినిమా నిలబడిందనే ఫీలింగ్ కలుగుతుంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X