విమర్శకుల సమీక్ష

  • అప్పట్లో ఆస్కార్ అవార్డ్ పొంది, ఘన విజయం సాధించిన 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' చిత్రం గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ సినిమాకు ఇండియన్ ఇంకా చెప్పాలంటే నాటు తెలుగు సినిమా వెర్షన్ ఇది. అంటే కోట్లు కురిపించే క్విజ్ షో ఎపిసోడ్ కు లవ్ స్టోరీ కలిపి వదిలిన కథ ఇది. ఇంతకు మించి ప్రత్యేకంగా ఈ సినిమా కథ గురించి మాట్లాడటానికి ఏమీలేదు. అయితే ప్రేరణ పొందటం తప్పేమీ కాదు కానీ మరీ నాటుగా,మోటుగా , రొటీన్ గా ఇన్స్పైర్ అయినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో అనీల్ కపూర్ పాత్ర తరహా క్యారక్టర్ ని నాగార్జన చేసారు...ఆయన రియల్ లైఫ్ లో చేస్తున్న టీవీ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'ను మళ్లీ చూపించారు. ఆ షో తాలుకూ సీన్లన్నీ 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' సినిమా నుంచి ప్రేరణగా పొంది రాసుకున్నవిగా అనిపిస్తాయి. క్లైమా్స్ సీన్స్ అందరూ వూహించిన విధంగానే సాగాయి.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X