నిర్మలా కాన్వెంట్ (2016)
Release date
16 Sep 2016
genre
నిర్మలా కాన్వెంట్ స్టోరి
నిర్మలా కాన్వెంట్ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అక్కినేని నాగేశ్వర రావు, రోషన్ శ్రీకాంత్, శ్రియా శర్మ, అదిత్య మీనన్, ఎల్ బి శ్రీరామ్, తాగుబోతు రమేష్, రవి ప్రకాష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జి నాగ కోటేశ్వర రావు వహించారు మరియు నిర్మాత నాగేశ్వర రావు అక్కినేని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రోషన్ సలూర్ స్వరాలు సమకుర్చరు.
కథ
పేదింటి అబ్బాయి శామ్యుల్ (రోషన్), డబ్బున్న అమ్మాయి శాంతి (శ్రియ శర్మ) చదువుకుంటూంటారు. ఒకే ఊరుకి చెందిన వీళ్లిద్దరూ షరా మూమూలుగా కొన్ని కవ్వించి, నవ్వించి, లవ్వించే సీన్లతో ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఆ పిల్ల తండ్రి భూపతి రాజు(ఆదిత్య మీనన్) కు తెలిసి మండిపడతాడు. గూండాలలాంటి తన పాలేర్లతో మన హీరో శామ్యూల్ ని కొట్టిస్తాడు. అయినా సరే తన కొడుకు ప్రేమని గెలిపించటం కోసం శ్యాముల్ తండ్రి వెళ్లి , హీరోయిన్ తండ్రి తో నీ కూతురుని ఇచ్చి నా కొడుకుతో పెళ్లి చేయమంటాడు...అప్పుడు ఆ రాజు గారు.. ఆ పేద తండ్రికి ఉన్న ఆ ఎకరం పొలం కూడా మోసంతో రాయించుకుని, 'పైసా లేని నువ్వు నా కంటే ఎక్కువ సంపాదించు, నాకంటే ఎక్కువ కీర్తి గడించు. అప్పుడు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా' అంటాడు. దాంతో డబ్బు సంపాదించడం కోసం శామ్యూల్ హైదరాబాద్ వచ్చి ఇక్కడ సినిమా హీరో నాగార్జున (నాగార్జున)ని కలుస్తాడు. ఆ తరవాత ఏమైంది? శామ్యూల్ డబ్బునీ.. కీర్తినీ ఎలా సంపాదించాడు? తన ప్రేమని ఎలా సాధించాడు? అనేదే ఈ చిత్ర కథ.
**Note:Hey! Would you like to share the story of the movie నిర్మలా కాన్వెంట్ with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు