twitter

    విమర్శకుల సమీక్ష

    • పటేల్ సర్‌ పాత్రలో జగపతి బాబు అదరగొట్టాడు. లుక్ పరంగా డిఫరెంట్ స్టైల్‌తో కనిపించాడు. తండ్రి పాత్రలో, కొడుకు పాత్రలో వైవిధ్యంగా నటించి మెప్పించాడు. ఓవర్ బిల్డప్‌లు లేకుండా తన వయసుకు తగిన నటనతో సూపర్బ్ అనిపించాడు. విలన్ పాత్ర పోషించిన కబీర్ దుహన్ సింగ్ అంత గొప్పగా కాక పోయినా తన పాత్రకు న్యాయం చేశాడు. వల్లభ్ భార్య పాత్రలో పద్మప్రియ, స్నేహితుడి పాత్రలో సుబ్బరాజు తదితరులు ఓకే. పౌడర్ పాండు పాత్రలో పోసాని కృష్ణ మురళి కాస్త నవ్వించాడు. సినిమా మొత్తం పటేల్ సర్ తో జర్నీ చేసిన బేబీ డాలీ తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది.

      సినిమాకు ఎంచుకున్న కథ రొటీన్ రివేంజ్ డ్రామా కావడంతో అసలు ఏం జరుగబోతోంది అనేది ప్రేక్షకడు ముందే ఊహించే విధంగా ఉంది. అయితే ఇంటర్వెల్‌లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఫస్టాఫ్ మొత్తం మెయిన్ విలన్ కాకుండా సైడ్ విలన్స్ మీద పగతీర్చుకునే విధంగా రోటీన్‌గా స్క్రీన్ ప్లే సాగింది. సెకండాఫ్‌లో అసలు రివేంజ్ ఏమిటి? అనేది చూపించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X