twitter
    TelugubredcrumbMoviesbredcrumbPittagodabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • యూత్ ని టార్గెట్ చేసుకునే సినిమాల్లో సిగరెట్లు, మద్యం, డబుల్ మీనింగ్ డైలాగులు అన్న యాంగిల్ లో కథలు సాగుతాయి. అయితే లక్కీగా ‘పిట్టగోడ' దానికి చాలా దూరంలో ఉంటుంది. అటువంటి సీన్స్ ఈ సినిమాలో లేకుండా చేసినందుకు డైరక్టర్ ని ముందుగా అభినందించాలి. ఈ సినిమాలో ఫస్ట్ మెచ్చుకోవాల్సిన హైలెట్ ఏమిటీ అంటే కథను వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేలా డిజైన్ చేసుకోవటం. అలాగని వాస్తవంగా చెప్పమన్నారు కదా అని ఓ ఆర్ట్ సినిమాలా కాకుండా...ఆసక్తికరంగా సినిమాటెక్ గా నడపటం. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. సినిమా ప్రారంభమై కధలోకి వెళ్లిపోయి.. నలుగురు కుర్రాళ్ల పరిచయం.. వాళ్ల ఇంట్లో జరిగే వ్యవహారాలు, స్నేహం... ఇవన్నీ మేళవించిన తొలి సీన్స్ అన్ని చకచకా సాగిపోతాయి. పేపర్లో పేరు, ఫొటో చూసుకోడం కోసం ఏమైనా చేయాలి? అనే పాయింట్‌ దగ్గర.. ఈ సినిమా కొత్త దారిలో వెళుతుందన్న ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ అక్కడి నుంచే... కథ పక్కదారి పడుతుంది. క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించాలనుకోవడం, దాని కోసం పొలిటీషన్స్ ని కలవడం.. ఇవన్నీ చూస్తుంటే కథ ఎక్కడికి పోతుందో అనిపిస్తుంది . అలాగే సెకండాఫ్ లో ఓ విలన్‌ని తీసుకువచ్చి, పాత్రల మధ్య కాంప్లిక్ట్ పండించాలని చూశారు. హీరోయిన్ దివ్యకేదో ఫ్లాష్‌ బ్యాక్‌ ఉందన్నట్లు బిల్డప్ ఇచ్చి.. దాన్ని కూడా తేల్చేశారు. క్లైమాక్స్ సీన్స్ మరింత మెరుగ్గా తీస్తే బాగుండేది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X