twitter

    విమర్శకుల సమీక్ష

    • రామూ...రక్తమూ ఎప్పుడూ హాట్ టాపిక్సే. ఇక ఆ రెండూ కలిస్తే ఇంకేముంది. నిజానికి నాకు ఈ సినిమా మొదలైనప్పటినుంచీ ఓ సందేహం పీకుతోంది. హిందీ హీరోతో తెలుగువారి కథ ఎంతవరకూ వర్కవుట్ అవుతుంది..జనం డబ్బింగ్ సినిమాలా ఫీలవరా అని. అయితే రక్త చరిత్ర చూసాక కేవలం పాత్ర మాత్రమే కనపడటానికే రామూ ఈ సాహసం చేసారని అర్దమైంది. రాయలసీమ వాస్తవ కక్షల చరిత్ర నేఫధ్యంతో పక్కా ఫార్ములా కథ అల్లి, విలన్-హీరోల మధ్య సంఘర్షణలనే హైలెట్ చేస్తూ వర్మ ఈ రక్త చరిత్ర సృష్టించారు. దాంతో చిత్రం చరిత్ర సృష్టించకపోయినా ప్రేక్షకాదరణకు మాత్రం లోటుండదని అన్పిస్తుంది. అయితే క్లైమాక్స్ లో కంక్లూజన్ ఇవ్వకుండా సెకెండ్ పార్ట్ కోసం వదిలేయటం మాత్రం కొంత నిరాశ కల్గిస్తుంది. అలాగే మితిమీరిన హింస (వర్మ చెప్తున్నదే అనుకోండి) ఫ్యామిలలను ధియోటర్స్ వైపు కన్నెత్తి చూడనీయదు. ఇక వీటిని ప్రక్కన పెడితే రామ్ గోపాల్ వర్మ తిరిగి తనను తాను ఆవిష్కరించుకుంటూ తీసిన కొత్త షాట్స్, ప్రేమ్ లు చూడ్డానికి మాత్రం సినీ ప్రియులు వెళ్ళాల్సిందే.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X