twitter

    రారండోయ్ వేడుక చూద్దాం స్టోరి

    రారండోయ్ వేడుక చూద్దాం సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో యువసామ్రాట్ నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, సంపత్, కౌసల్య, ఇర్షాద్, చలపతి రావు, అన్నపూర్ణ, పృథ్వీ, సప్తగిరి, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖా వాణి, అనితా చౌదరి, ప్రియ, తాగుబోతు, మధు తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ-మాటలు-దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ నిర్వహించారు మరియు నిర్మాత నాగార్జున అక్కినేని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చరు. 

    కథ

    కృష్ణ (జగపతిబాబు), ఆది (సంపత్) ప్రాణ స్నేహితులు. కానీ ఓ విషయంలో వారిద్దరూ విడిపోతారు. కృష్ణ కూమారుడు శివ (నాగచైతన్య), ఆది కూతురు భ్రమరాంబ (రకుల్ ప్రీత్ సింగ్) ఓ పెళ్లి కలుసుకొంటారు. వారి మధ్య ఏర్పడిన పరిచయం వారిని చాలా దగ్గరికి తీస్తుంది. భ్రమరాంబ అంటే శివకు చెప్పలేనంత ఇష్టం. తన మనసులోని ప్రేమను చెబితే భ్రమరాంబ ఎక్కడ దూరం అవుతుందనే భయంతో కృష్ణ తనలోనే ఉంచుకొంటాడు. అయితే బ్రమరాంబ మరో రకంగా ఉంటుంది. తన కోసం ఆకాశం నుంచి రాజకుమారుడు వస్తాడు. పూలబాటపై నడిపిస్తాడు. పడవ లాంటి కారులో ఊరేగిస్తాడు లాంటి భ్రమల్లో బతుకుతూ ఉంటుంది. ఆ భ్రమల్లో బతికే బ్రమరాంబ శివ ప్రేమను అర్థం చేసుకోలేకపోతుంది. ఓ సందర్భంలో శివ తన మనసులోని ప్రేమను చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో శివ ప్రేమను భ్రమరాంబ అపార్థం చేసుకొంటుంది. తన తండ్రి ఇష్టం మేరకు తన బావను పెళ్లి చేసుకోవడానికి సిద్దపడుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భ్రమరాంబను ఎలా ఒప్పించి పెళ్లి చేసుకొంటాడు? శివ ప్రేమను భ్రమరాంబ అర్థం చేసుకోవడానికి ఎలాంటి పరిస్థితులు దోహదపడ్డాయి. కృష్ణ, ఆది స్నేహాన్ని దెబ్బ తీసిన మూడో వ్యక్తి ఎవరు. కృష్ణ, ఆది ఎందుకు విడిపోయారు? మళ్లీ వారిద్దరూ ఎలా ఒక్కటయ్యారు? శివ, భ్రమరాంబలు రారండోయ్ మా పెళ్లి వేడుకకు ఆహ్వానించడానికి అనుకూలించిన పరిస్థితులు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా
    **Note:Hey! Would you like to share the story of the movie రారండోయ్ వేడుక చూద్దాం with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X