twitter
    TelugubredcrumbMoviesbredcrumbRoguebredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • మంచి ఫిజిక్ ఉన్న ఇషాన్, ఏంజెలా, మన్నారా చోప్రాల మధ్య లవ్ సీన్స్‌ను ఎప్పటిలానే తనదైన శైలిలో చిత్రీకరించి తన మార్కును పూరి నిలబెట్టుకొన్నాడు. పూరి ప్రేమకథల్లో ఫీల్ అనేది కీలకమైన అంశం. అయితే ఆ ఫీల్ అనేది రెండు ప్రేమ కథల్లోనూ పూరి స్థాయిలో కనిపించకపోవడం కొంత నిరాశ పరిచే అంశం. ‘దరిద్రం వదిలి పోతుంటే వెంటపడకూడదు'. ‘వాడి భార్య గురించి వాడికే తెలియదు' లాంటి డైలాగ్స్ అక్కడక్కడా పేలాయి. రెగ్యులర్ పూరి సినిమాల్లో కనిపించే పంచులు పూర్తి స్థాయిలో కనిపించలేదు. లవ్ సీన్లలో ఫీలింగ్ కంటే శృంగారమే మితి మీరింది. నాసిరకమైన సీన్లతో చాలా వేగంగా చుట్టేశాడనే భ్రమ కనిపిస్తుంది. యాక్షన్ సీన్లు బాగున్నాయి. కానీ కథలో భాగమై అదనపు బలంగా మారడానికి అవి తోడ్పాటునందిస్తాయా అనేది ప్రశ్నార్థకమే. మరో చంటిగాడి ప్రేమ కథ అనే ట్యాగ్‌తో విడుదలకు ముందే ఆకట్టుకొన్న పూరి.. ఇడియట్ చిత్రానికి దారిదాపుల్లోకి కూడా వెళ్లే ప్రయత్నం చేసినట్టు కనిపించలేదు. ఈ జనరేషన్‌ను దృష్టిలో పెట్టుకొని రోగ్‌ను నిర్మించే ప్రయత్నం చేశాడు. కానీ స్క్రిప్టు విషయంలో మితి మీరిన విశ్వాసంతో నేల విడిచి సాము చేసినట్టు కనిపిస్తుంది. ఏది ఏమైనా రోగ్‌లో పూరి మార్క్ డైలాగ్స్, మేకింగ్, లవ్ సీన్లు సరిగా పండలేదనే చెప్పవచ్చు. రోగ్ ఓ సాదాసీదా చిత్రమనే భావన కలుగడం ఖాయం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X