విమర్శకుల సమీక్ష

  • ‘ద గాడ్‌ఫాదర్‌' చిత్రం ప్రేరణతో కథ రాసుకొన్నట్టు టైటిల్‌ కార్డ్స్‌లో వేశారు గౌతమ్‌మేనన్‌. హీరో పాత్రని ఈ కథలో హీరోయిన్ చేసారు. కానీ వర్మ ఇప్పటికే చాలా సార్లు ఇదే కథని వండి వార్చేయటంతో...పెద్ద కొత్తగా అనిపించదు. సినిమాలో హీరోయిన్ ని ఎదుకు విలన్స్ చంపాలనుకుంటున్నారనే విషయం చివరి నిముషం వరకూ బయిటపెట్టకుండా స్క్రీన్ ప్లే చేసారు గౌతమ్ మీనన్. అయితే అదే విసుగుతెప్పించింది. ఎందుసేపూ వన్ సైడ్ వార్ లాగ అనిపిస్తుంది. అలాగే లాస్ట్ టెన్ మినిట్స్ లో పజిల్ మొత్తం కొన్ని డైలాగ్స్ లో రివీల్ చేసేయటం కూడా ఆకట్టుకోదు. వాస్తవానికి థ్రిల్లింగ్‌ ఫార్మెట్ లో స్క్రీన్ ప్లే చేసిన ఈ కథకి ఓ రేంజి విలనిజం అవసరం. కానీ అది కూడా బలంగా ఏమీ పండలేదు. చాలా వీక్ గా అనిపించి, హీరోకు ఛాలెంజ్ లాగ కనపడదు. ఆ పాత్రలో బాబా సెహగల్‌ బాగానే నటించాడు కానీ... ఆ పాత్రలో విలనిజం మాత్రం పండకపోవటం మైనస్ అయ్యింది. ఫస్టాఫ్ అంతా గౌతమ్ మీనన్ తను మాస్టరీ చేసిన రొమాన్స్‌ ఎపిసోడ్స్ తో, రోడ్ ట్రిప్‌తో సరదాగా నడిపేసాడు, అలాగే ఇంటర్వెల్‌లో ట్విస్ట్ వేసి కథని లాక్ చేసాడు. అయితే అక్కణ్ణుంచి సినిమానంతా ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా మారిపోయి..జానర్ ఛేంజ్ అయ్యి...ఇబ్బందిగా అనిపించింది. అలాగే.. ఫస్టాఫ్‌లో గౌతమ్ మీనన్ స్టైల్ మేకింగ్, రొమాంటిక్ సీన్స్ నుంచి పుట్టే ఫన్‌తో చాలా బాగుంది. స్లో నేరేషన్, వెంట వెంటనే వచ్చే పాటలు ఫస్ట్ హాప్ లో కాస్త బోర్ కొట్టిస్తాయి. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారిని సెంకడ్ హాఫ్ బాగుందనిపిస్తుంది. అయితే పూర్తి స్దాయి సీరియస్ నెస్ తో సాగుతుంది. అలాగే...తాను... నేను, చకోరి... పాటలు బాగున్నాయి. వెళ్లిపోమాకే పాట బాగున్నప్పటికీ అది ప్లేస్‌మెంట్‌ సరిగ్గా కుదర్లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా స్థాయిని పెంచాడు. సెకండాఫ్ లో మరింత జాగ్రత్తలు తీసుకుని ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదనిపిస్తుంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X