twitter

    విమర్శకుల సమీక్ష

    • మాంచి మాస్ కథని పూర్తిగా మార్చేసి కేవలం కామెడీకోసమే ఈ కథ అన్నట్టు చూపించటం లో దర్శకుడు సక్సెస్ అయినట్టే. అందులోనూ సప్తగిరి లాంటి హీరో ఎలా చేస్తే వర్కౌట్ అవుతుందో అంతవరకే అతన్ని వాడుకున్నడు. పగా, ప్రతీకారం అనగానే కనిపించే భారీ ఫైట్లూ, పంచ్ డైలాగులూ లేకుందా మొత్తానికి సప్తగిరితో ఓవర్ యక్షన్ చేయించకుండా అతన్ని ఫ్రీగా వదిలేసాడు. బ‌య‌ట సినిమాల్లో స‌ప్త‌గిరి ఎలా న‌వ్వించాడో, ఇక్క‌డా అలానే న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. పాట‌లు, ఫైటులు చేసినా అవీ కామెడీగానే సాగాయి. స‌ప్త‌గిరి న‌ట‌న‌పై పిచ్చి చూపించే సీన్లు, కాలేజీలో గోల్డు మెడ‌ల్ కోసం వేసిన వేషాలు న‌వ్విస్తాయి. త‌న న‌ట‌నా ప్ర‌తిభ చూపించ‌డానికి త‌ల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి వేసిన ఏక పాత్రాభిన‌యం ఈ సినిమాకి హైలెట్ అయ్యింది. తండ్రి మ‌ర‌ణం.. దాన్నుంచి పుట్టుకొచ్చిన ఎమోష‌న్ ఈ సినిమాని ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌కూ ద‌గ్గ‌ర చేస్తుంది. చెప్పాలంటే సినిమా అంతా స‌ప్త‌గిరి వ‌న్ మ్యాన్ షో..అనే చెప్పుకోవాలి న‌వ్వించాడు..ఎమోష‌న్ పండించాడు. ఆ మాట‌కొస్తే.. కామెడీ సీన్ల‌లో కంటే ఎమోష‌న్ సీన్ల‌లోనే స‌ప్త‌గిరి న‌ట‌న బాగుంది. ష‌క‌ల‌క శంక‌ర్ స‌పోర్టింగ్ రోల్‌ని ర‌క్తి క‌ట్టించాడు. పోసానిది అల‌వాటైన పాత్రే ఈ తరహా పాత్రల్లో పోసాని బాగా ఇమిడి పొతాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X