విమర్శకుల సమీక్ష

  • పవన్‌ కల్యాణ్‌ సినిమాలో హీరోయిన్‌ లేకపోయినా ఫర్వాలేదు కానీ గన్నులూ, గుర్రాలూ ఉండాల్సిందే. తన సినిమాల్లో బుల్లెట్ల వర్షం కురిపించడం, స్టైల్‌గా గుర్రాన్ని నడిపించుకొంటూ రావడం పవన్‌కి సరదా. 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'లోనూ అంతే జరిగింది. అదొక్కటే హైలెట్ అయ్యేలా చూసుకున్నారు. పవన్ సూపర్ హిట్ గబ్బర్ సింగ్ స్దాయిలో ఉంటుదంనుకుని వచ్చినవాళ్లకు ఆ సినిమాలో సగం కూడా లేకోపోవటం నిరాశ కలిగించే అంశం. ఈ పోలిక రావటానికి కారణం..సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్రాంచైజ్ కావటమే. ఇక వెస్ట్ర్రన్ సినిమాలను తలపిస్తూ...కౌబాయ్ లుక్ తో పవన్ చేసే విన్యాసాలు బాగున్నాయి. అయితే వచ్చిన ఇబ్బంది అంతా...దాదాపు అవే సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్.... వీణ స్టెప్పు వేయడం, శంకర్ దాదా ఎంబీబియస్ మూవ్ మెంట్స్ ...మెగా ఫ్యాన్స్ కు బాగా నచ్చుతుంది. కాకపోతే పవన్ వంటి పవర్ స్టార్ శ్రీను వైట్ల సినిమా తరహాలో ఎపిసోడ్స్ డిజేన్స్ చేస్తూ నడపాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది. కంటెంట్ లేనప్పుడు కటౌట్స్ ఎన్ని ఉంటే ఉపయోగముంటుంది అన్నట్లు సినిమాలో కంటెంట్ విషయంలో సినిమా మొదటనుంచీ రాంగ్ స్టెప్స్ పడుతూ వచ్చాయి. దాంతో పవన్ ఎంత సినిమాని మోద్దామని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X