శైలజారెడ్డి అల్లుడు (2018)(U/A)
Release date
13 Sep 2018
genre
శైలజారెడ్డి అల్లుడు స్టోరి
శైలజారెడ్డి అల్లుడు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ చైతన్య, అను ఎమ్మానుయెల్, రమ్య కృష్ణన్, వెన్నెల కిశోర్, రఘుబాబు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మారుతి వహించారు మరియు నిర్మాత నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించారు.
కథ
తండ్రి (మురళీశర్మ) ఇగోను భరిస్తూ సొంత కంపెనీకి ఎండీగా చైతన్య (నాగచైతన్య) బాధ్యతలు వహిస్తుంటారు. తండ్రి ప్రవర్తన వల్ల చెల్లెలు పెళ్లి ఎత్తిపోతుంది. ఈ క్రమంలో అను (అను ఇమ్మాన్యుయేల్)తో ప్రేమలో పడుతాడు. కానీ ఆమెకు ఒంటి నిండా పొగరు (ఇగో), తలబిరుసు వ్యక్తిని తెలుసుకొంటాడు. అలాంటి అను చేత నేను ప్రేమిస్తున్నాను అని చెప్పించడంలో చైతూ సక్సెస్ అవుతాడు. కానీ వారి పెళ్లికి తన తల్లి శైలజారెడ్డి (రమ్యకృష్ణ) సమస్యగా మారుతుంది. ఐదేళ్లుగా తల్లి, కూతురు మధ్య మాటల్లేవని చైతూ తెలుసుకొంటాడు. కూతురి కంటే ఎక్కువ ఇగో ఉన్న శైలజారెడ్డిని పెళ్లికి ఒప్పించడం కష్టంగా మారుతుంది. కూతురు పెళ్లి ఎత్తిపోవడానికి తండ్రిగా మురళీశర్మ ఏం చేశాడు? చెల్లెలి పెళ్లి చేయడానికి చైతూ ఎలాంటి బాధ్యతను ఎత్తుకొన్నాడు? అను ప్రేమను గెలుచుకోవడానికి చైతూ వేసిన ఎత్తులేంటి? శైలజారెడ్డికి, అనుకు ఎందుకు మాటల్లేవు? శైలజారెడ్డిని చైతూ ఎలా బుట్టలో వేసుకొన్నాడు? తన తండ్రి ప్రవర్తనను మార్చడానికి చైతు ఏం చేశాడు. చెల్లెలి పెళ్లిని చైతూ ఎలా చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే శైలజారెడ్డి అల్లుడు.
**Note:Hey! Would you like to share the story of the movie శైలజారెడ్డి అల్లుడు with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు