twitter

    విమర్శకుల సమీక్ష

    • మంతకమణి మల్టీస్టారర్ కథ కావడంతో పాత్రల పరిచయంతోనే ఫస్టాఫ్‌లో కొంత భాగం గడిచిపోతుంది. మిగితా సగభాగంలో పాత్రల ఎస్టాబ్లిష్‌మెంట్, ఆ పాత్రల కష్టసుఖాలతో కథ చకచకా సాగిపోతుంది. ఇంటర్వెల్ ముందు రాల్స్ రాయిస్ చోరి కావడం అనే ఇంట్రస్టింగ్ పాయింట్‌తో మొదటి భాగంలో ప్రేక్షకుడిని ఆసక్తి కలిగించడంలో దర్శకుడు శ్రీరాం ఆదిత్య తన ప్రతిభను తెరపైన ఆవిష్కరించుకొన్నాడు. ఈ సినిమాకు ముందు ఒకే సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీరాం నలుగురు హీరోలు, సీనియర్ ఆర్టిస్టు రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ పాత్రల చిత్రీకరణలో బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం సినిమాకు ప్లస్ అయింది. సెకండాఫ్‌లో ఆసక్తిని కలిగించే పాయింట్ ఉండటంతో ఏమి జరిగిందనే అంశాన్ని తెలుసుకోవడానికి సిద్ధమైన ప్రేక్షకుడికి ఓ డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. కథలో అనేక ట్విస్టులు, టర్నింగ్‌లు ప్రేక్షకులను థ్రిల్లింగ్ గురిచేస్తాయి. పాత్రల పరిధి మేరకు దర్శకుడు ఆయా నటుల నుంచి మంచి నటనను రాబట్టుకొన్నారు. నారా రోహిత్ ఇన్వెస్టిగేషన్‌ చేసే విధానాన్ని చక్కగా రాసుకొన్నారు. బలమైన సన్నివేశాల కారణంగా సినిమా ఎక్కడా డ్రాప్ కాకుండా నిలబడగలిగింది. క్లైమాక్స్‌లో ఊహించని విధంగా కథను మలుపు తిప్పి శమంతకమణిని యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ అనే ఫీలింగ్‌ను కల్పించాడు.

      శమంతకమణి చిత్రం రెగ్యులర్ ఫార్మాట్ చిత్రం కాదు. ఈ చిత్రం స్క్రీన్ ‌ప్లే ఆధారంగా సాగే చిత్రం. కొత్త దర్శకుల రూపొందించే సినిమాలు పాతతరం దర్శకుల మేకింగ్‌, సంప్రదాయ పద్దతలకు దూరంగా ఉంటాయి. అయితే సినిమాకు కావాల్సిన కమర్షియల్ హంగులు, కామెడి అంశాలు పుష్కలంగానే ఉన్నాయి. కానీ ఈ చిత్రం మల్టీప్లెక్స్ ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉంటే చిత్రం. ప్రస్తుతం బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల టేస్ట్‌ కూడా పరిస్థితులకు అనుగుణంగా మారుతుందనే అంశం ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు రుజువు చేశాయి. ఒకవేళ బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అయితే భవ్య క్రియేషన్స్ బ్యానర్‌, దర్శకుడు శ్రీరాం ఆదిత్య ఖాతాలో మరో విజయం చేరడం ఖాయం. ఈ సినిమా హిట్ అయితే నలుగురి హీరోలకు పెద్దగా పేరు వచ్చే పరిస్థితి కనిపించదనే మాటను బలంగా చెప్పవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X