twitter

    శతమానం భవతి స్టోరి

    శతమానం భవతి సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వనంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజు, జయసుధ, తనికెళ్ళ భరణి, నరేష్, ఇంద్రజ, రాజ రవింద్ర, ప్రవీణ్, శిజు, దిల్ రాజు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విగ్నేష సతీష్ వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చరు. 

    కథ

    తూర్పు గోదావరి జిల్లా ...ఆత్రేయపురంలో రాఘవ రాజు (ప్రకాష్ రాజ్), జానకమ్మ (జయసుధ) ఒంటిరిగా జీవితాన్ని లీడ్ చేస్తూంటారు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అయితే ఆ పిల్లలంతా విదేశాల్లో స్థిరపడటంతో ఈ జంట ఒంటిరిదైపోయింది. గత జ్ఞాపకలాతో గడిపే ఈ పెద్ద వాళ్లిద్దరితో పాటు మనవడు రాజు (శర్వానంద్) కూడా కలిసి ఉంటారు. విదేశాల్లో స్థిరపడిపోయిన వారి పిల్లలు తమ జీవితాల్లో బిజీ అయ్యి... ఎప్పుడూ ఇటు వైపు కన్నెత్తి చూసిన పాపాన పోరు. అయితే తన పిల్లలంతా ఈ సంక్రాంతి పండుగకు అయినా వస్తే బాగుండును అని రాజుగారు భావిస్తారు. పిలిస్తే రారు అని తెలిసిన ఆయన అందుకోసం ఓ ప్లాన్ వేసి అమలు చేస్తారు. ఆ ప్లాన్‌ వర్కవుట్ అయ్యి... పిల్లలంతా కూడా విదేశాల నుండి తన ఊరుకి సంక్రాంతికి వస్తారు. వారితో పాటు ఈ క్ర‌మంలోనే ఆస్ట్రేలియాలో ఉంటున్న రాజుగారి కూతురు ఇంద్ర‌జ కుమార్తె, రాజు గారి మ‌న‌వ‌రాలు నిత్యా (అనుపమ పరమేశ్వరన్) కూడా ఆత్రేయ‌పురం వ‌స్తుంది. మన హీరో రాజు, నిత్యాలు బావా మరదలు అవ్వడంతో ఇద్దరి మద్య ప్రేమ ఆటోమెటిక్ గా మొదలవుతుంది. ఆ ఇంట్లో సంక్రాంతి సంబ‌రాల్లో అంద‌రూ మునిగి తేలుతుండ‌గానే రాజుగారు వేసిన ప్లాన్ భార్య జాన‌క‌మ్మ‌కు తెలిసి పెద్ద గొడ‌వ జ‌రుగుతుంది. ఆ కుటుంబంలో పెద్ద క‌ల‌త‌లు చెల‌రేగుతాయి. అస‌లు రాజు గారు వేసిన ప్లాన్ ఏంటి ? ఆయ‌న త‌న పిల్ల‌ల‌కు ఏం చెప్పాల‌నుకున్నాడు ? చివ‌ర‌కు రాజు-నిత్య‌ల ప్రేమ క‌థ ఏమైంది ? అన్న‌ది తెలియాలంటే ..ఈ సినిమా చూసి తెలుసుకోండి.

    **Note:Hey! Would you like to share the story of the movie శతమానం భవతి with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X