Telugu » Movies » Shivalinga » Story

శివలింగ (U)

సినిమా శైలి

Romance, Thriller

పాఠకుల రివ్యూ

విడుదల తేదీ

14 Apr 2017
కథ
శివలింగ సినిమా కన్నడలో గతేడాది సూపర్ హిట్ అయిన చిత్రం "శివలింగ" ఇప్పుడు అదే "శివలింగ" పేరుతో తెలుగులో ఈ చిత్రం రీమేక్ అవుతొంది ఇది రోమ్యాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో లారెన్స్, రితికాసింగ్, శక్తి వాసు, వడివేలు, ప్రదీప్ రవత్, ఊర్వసి, జయప్రకాష్ వి, రాధా రవి, విటివి గణేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పి వాసు నిర్వహించారు మరియు అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ స్వరాలు సమకుర్చరు. 

కథ

రహీమ్ అనే ఓ వంటవాడు ట్రైన్ లో హత్యకు గురవుతాడు. అయితే చూడటానికి అతడి మరణం ట్రైన్ నుండి దూకి ఆత్మహత్యకు గురైనట్లు ఉంటుంది. అతడు హత్యకు గురైనట్లు ఆధారాలు లేక పోవడంతో ఆత్మహత్యగానే కేసు క్లోజ్ చేస్తారు. అయితే రహీమ్ ప్రియురాలు.... రహీమ్ ఆత్మహత్య చేసుకునేంత పరికివాడు కాదు అంటూ.... పెద్ద పోలీస్ ఆఫీసర్ ను కలిసి కేసు రీ ఓపెన్ చేయిస్తుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సమర్థుడైన సీబి సీఐడి ఆఫీసర్ శివలింగ(రాఘవ లారెన్స్)కు అప్పజెబుతారు. రహీమ్ హత్య కేసు తన చేతికి రావడం, అదే సమయంలో శివలింగకు సత్యభామ(రితికా సింగ్)తో పెళ్లి దాదాపు ఒకేసారి జరుగుతుంది. తనను ఎవరు? ఎందుకు చంపారో? తెలుసుకోవడానికి రహీమ్ ఆత్మ పరితపిస్తుంది. శివలింగ భార్య సత్య శరీరంలోకి ప్రవేశించి త్వరగా కేసు సాల్వ్ చేయాలని, అప్పటి వరకు నీ భార్య శరీరంలోనే ఉంటానని బ్లాక్ మెయిల్ చేస్తుంది రహీమ్ ఆత్మ. తన భార్యను కాపాడుకోవడానికి శివలింగ ఏం చేసాడు? ఎలాంటి సాక్ష్యాలు లేని ఈ కేసును ఎలా సాల్వ్ చేసాడు? అనేది తర్వాతి కథ.