TelugubredcrumbMoviesbredcrumbSimhabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • "చరిత్ర సృష్టించాలన్నా తిరగ రాయాలన్నా మా వంశం వారికే చెల్లు" అంటూ బాలకృష్ణ..'సింహా' వచ్చేసింది. బాలయ్య గత హిట్ చిత్రాలు 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు','లక్ష్మీ నరసింహ' టైటిల్స్ లో కామన్ గా ఉన్న 'సింహా' ని తీసుకుని సెంటిమెంట్ గా టైటిల్ పెట్టారని సినిమా రిలీజ్ ముందు వరకూ అంతా అనుకున్నాం. అయితే ఆ హిట్ చిత్రాల్లోని కీలకమైన సీన్స్,స్క్రీన్ ప్లే ను కూడా తీసుకుని సినిమాను రూపొందించారు అని చిత్రం చూసాక అర్ధమవుతుంది. ఇక విడుదలకుముందే విపరీతమైన అంచనాలు పెరిగిన సింహా...ఆ రేంజి అంచనాలు అందుకుందా అంటే కొంత మేరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. నిజానకి వరస ఫ్లాపులతో దూసుకుపోతున్న బాలకృష్ణకు ఈ చిత్రంతో రిలీఫ్ దొరికినట్లే. కానీ పాత కథ, ఎన్నో సినిమాల్లో ఇప్పటికే చూసిన సీన్లతో దర్శకుడు అల్లిన కథనమే కాస్త ఇబ్బంది పెడుతుంది. అయితే బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగులు, ఎమోషన్స్ పండించే తీరు ఆ లోటు తెలియనివ్వదు. అలాగే హీరోయిన్స్ లో నమిత మరీ లావై ఇబ్బంది పెడితే, స్నేహా ఉల్లాల్..బాలకృష్ణ నిండైన విగ్రహం ముందు తేలిపోయింది. ఉన్నంతలో నయనతారే ఎపిసోడ్ బావుందనిపిస్తుంది. అయితే బాలకష్ణ ద్విపాత్రలలో వేరియేషన్ చూపుతూ...వయస్సును లెక్కచేయకుండా చేసే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రాణమై నిలుస్తాయి. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులుకు ఈ చిత్రం బాగా నచ్చే అవకాశం ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X