సోగ్గాడే చిన్నినాయన (2016)(U/A)
Release date
14 Jan 2016
genre
విమర్శకుల సమీక్ష
-
తండ్రీకొడుకులు బంగార్రాజు, డా. రాముగా నాగార్జున వైవిధ్యమైన నటనతో అదరగొట్టాడు. బంగార్రాజు పాత్రలో మరోసారి మన్మధుడిగా తనకున్న పేరు నిలబెట్టుకున్నారు. బంగార్రాజు పాత్రలో కోనసీమ యాసలో డైలాగ్స్ అదరగొట్టేసాడు. రెండు పాత్రల్లో ఆయన లుక్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా పర్ ఫెక్ట్ అనిపించుకున్నారు. బంగార్రాజు భార్యగా, రాము తల్లిగా రమ్యకృష్ణ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. లావణ్య త్రిపాఠి అందంగా కనిపించడంతో పాటు అభినయం పరంగా ఆక్టుకుంది. ఆత్మానందం పాత్రలో బ్రహ్మానందం, సప్తగిరి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి బావుంది. సంపత్ రాజ్ నెగటివ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. నాజర్, చలపతిరావు, ఎల్.బి. శ్రీరామ్ తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగి పోయారు.
సంబంధిత వార్తలు