twitter
    TelugubredcrumbMoviesbredcrumbSpyderbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • చావు కేకలు, ఏడుపులతో మహానందం పొందే ఓ దుష్టుడి పాత్ర చుట్టూ అల్లుకొన్న కథ స్పైడర్. చిన్నతనంలో సమాజంలో ఎదురైన పరిస్థితుల వల్ల ఓ బాలుడు దుష్టుడుగా ఎలా మారాడనే పాయింట్ పాయింట్ చుట్టూ దర్శకుడు మురుగదాస్ ఆసక్తిగానే అల్లుకొన్నారు. ఆ పాత్ర చుట్టూ ఉండే మిగితా పాత్రలను డిజైన్ చేయడంలో తడబాటు గురైనట్టు అనిపిస్తుంటుంది. సామాజిక అంశాల ఎక్కువగా సృశించే మురుగదాస్ మరోసారి అదే ప్రయత్నం చేశారు. గ్లామర్ ఇమేజ్ ఎక్కువ ఉన్న మహేశ్‌ను ఈ కథకు ఎంపిక చేసుకొని సాహసానికే ఒడిగట్టాడని చెప్పవచ్చు.

      కథతో కాకుండా కథనంతో దర్శకుడు మురుగదాస్ చేసిన కసరత్తు స్పైడర్. మహేశ్ బాబు ఇమేజ్ కాకుండా తన ఆలోచనలను నమ్ముకొని చేసిన సినిమా ఇది. కేవలం రెండు పాత్రలపై చేసిన కథా ప్రయాణం ఇది. మిగితా పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, తెలుగుదనం కంటే ఎక్కువ తమిళ వాసనే కనిపించడం ఓ ప్రతికూలత. తెలుగులో విజయవకాశాలు ఎలా ఉన్నా.. తమిళంలో భారీ హిట్‌గా మారే అవకాశం ఉంది. లాంగ్ వీకెండ్ కావడంతో భారీ కలెక్షన్లు మహేశ్ స్టామినాకు అద్దం పట్టడం ఖాయం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X