twitter
    TelugubredcrumbMoviesbredcrumbThikkabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • హాలీవుడ్ చిత్రం హ్యాంగోవర్ ని గుర్తు చేసే ఈ కథని కన్ఫూజన్ కామెడీ గా చేసి నవ్విద్దామని దర్శకుడు అభిప్రాయం. అయితే కథలో పాత్రలను కన్ఫూజన్ చేసే క్రమంలో కథకుడే డైరక్టర్ అయిన సునీల్ రెడ్డి కన్ఫూజ్ అయిపోయినట్లున్నాడు. అక్కడక్కడా నవ్వించినా చాలా వరకూ నవ్వులు పాలైంది. ఈ మధ్యకాలంలో ఇంత తిక్క తిక్కగా రాసిన కథ కానీ, సినిమా కానీ ఏదీ లేదనే చెప్పాలి. సినిమా అవుట్ పుట్ చూసుకుని టైటిల్ పెట్టాడా అనే డౌట్ వచ్చేలా సినిమా నడుస్తుంది...సినిమాలో చాలామంది నటీనటులున్నారు. అయితే ఎవరినీ సరిగా ఉపయోగించుకోలేదు. సరికదా వాళ్లందిరి చేతా గోల గోల చేయించాడు. ఆఖరికి రాజేంద్రప్రసాద్‌, ఇద్దరు హీరోయిన్లతో సహా..అందరూ గోల చేయటమే సరిపోయింది...స్పెషాలిటీ ఏమిటీ అంటే ప్రతీ క్యారక్టర్ చేతిలోనూ ఓ మందుబాటిల్ ఉండటమే. తిక్క అని పెట్టకుండా మందు బాటిల్ అని పెట్టినా పోయిదేమో అనిపిస్తుంది. సాయి ధరమ్ తేజ చాలా ఉషారుగా నటించే ప్రయత్నం చేసాడు. సీన్స్ లో బలం లేనప్పుటికీ ఉన్నంతలో వాటిని కవర్ చేసే ప్రయత్నం చేసాడు కానీ బొక్కలెక్కవటంతో బోర్లా పడ్డాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X