twitter

    విమర్శకుల సమీక్ష

    • వరుణ్, రాశీల మధ్య తొలిప్రేమ రైల్లో పుట్టడం ద్వారా వారి జీవితం ప్రారంభమవుతుంది. ఓకే కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్, సహచరులు మధ్య ఆటపట్టించే సన్నివేశాలతో చకచక కథ సాగిపోతుంటుంది. ప్రేమలో ఇష్టాఅయిష్టాలను, ప్రేమానురాగాలను చిన్న సంఘటనలు, సన్నివేశాల ద్వారా సినిమా ఆసక్తిగా మారుతుంది. ఓ ఇగో కారణంగా వరుణ, రాశీ విడిపోవడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.

      సెకండాఫ్‌లో బ్రేకప్ మెమోరీస్ నుంచి బయటపడటానికి ఆదిత్య లండన్‌కు వెళ్లిపోతాడు. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకొని తన ప్రాణస్నేహితుడు ప్రియదర్శితో, ఇతర స్నేహితులతో ఉద్యోగంలో చేరిపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఆదిత్య జీవితంలోకి వర్ష మళ్లీ ప్రవేశిస్తుంది. వారి మధ్య మళ్లీ ప్రేమ చిగురించి ఒక్కటవ్వడం ద్వారా సినిమా ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌తో ముగుస్తుంది.

      ఫైనల్ గా..
      ప్రస్తుత జనరేషన్‌లో కనిపించే సంఘటనలే తొలిప్రేమ చిత్రం కథ. ఈ కథలో వరుణ్ తేజ్, రాశీఖన్నా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. వీరిద్దరూ పోటాపోటీగా నటించడం వల్లే సినిమాకు ఓ ఫీల్‌ ఫ్యాక్టర్ జనరేట్ అయింది అనిచెప్పవచ్చు. క్యాటగిరీలు లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను టచ్ చేసే సినిమా తొలిప్రేమ. ఈ సినిమా సక్సెస్ ఏ రేంజ్ అని తెలుసుకోవాలంటే రెండు రోజుల తర్వాత మోగే రికార్డుల మోతే చెబుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X