twitter

    విమర్శకుల సమీక్ష

    • పెర్పార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సునీల్... సునీల్ మాదిరిగానే చేశాడు. డాన్సులు, ఫైట్లు రొటీన్‌. ఇంతకు మించి చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ లేదు. కాక పోతే సునీల్ లుక్ పరంగా గత సినిమాల కంటే ఇంకా వరస్టుగా కనిపించాడు. అతడి ఫేసులో గ్లామర్, బాడీ లాంగ్వేజల్‌లో గ్రేస్ బాగా తగ్గిపోయింది. ఈ అంశాల పరంగా సునీల్‌కు మైనస్ మార్కులే. అంతకు ముందు సునీల్ సిక్స్ ప్యాక్ చూసిన వారికి ఈ సినిమాలో అతడు మరింత హెవీగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్ మియా జార్జ్ లుక్ పరంగా. పెర్ఫార్మెన్స్ పరంగా ఓకే. సునీల్ పక్కన బావుంది. ఆమెను ఎక్కువగా పాటలకే పరిమితం చేశారే తప్ప.... పెర్ఫార్మెన్స్ పరంగా నిరూపించుకునే అవకాశం మాత్రం ఇవ్వలేదు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ తర్వాత చెప్పుకోదగ్గ ముఖ్యమైన పాత్ర ప్రకాష్ రాజ్ పోషించిన రంగనాయర్ పాత్ర. కరడుకట్టిన కమ్యూనిస్టు పాత్రలో ప్రకాష్ రాజ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాలో అతడి గెటప్, బాడీలాంగ్వేజ్ ఆయన పాత్రకు మరింత వన్నె తెచ్చింది. బాదాం బాబా పాత్రలో పోసాని నవ్వులు పూయించారు. లెనిన్ సుధాకర్ పాత్రలో చెగోవిరా గెటప్‌లో వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, వేణు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

      సినిమాలో పెద్ద మైనస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే.... ఈ సినిమా కథే. ఇలాంటి రోటీన్ కథలు చూసీ చూసీ ప్రేక్షకులు విసుగెత్తిపోయి ఉన్నారు. సునీల్ మరోసారి ఇలాంటి బోరింగ్ కథతో వచ్చి ప్రేక్షకులను మరోసారి బోర్ కొట్టించారు. సినిమా స్క్రీన్ ప్లే కూడా అంతగా ఆకట్టుకోలేదు. సునీల్ సినిమా అంటే చాలా మంది కామెడీ ఆశించి వెళతారు. రెండు మూడు చోట్ల తప్ప ఎక్కడా పెద్దగా కామెడీ పండలేదు. పరమ రొటీన్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో చాలా సీన్లు లాజిక్ లేకుండా ఉన్నాయి. లాజిక్ పక్కన పెట్టి సినిమా ఎంజాయ్ చేద్దామన్నా... అలాంటి పరిస్థితులు సినిమాలో ఎక్కడా కనిపించలేదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X