twitter

    విమర్శకుల సమీక్ష

    • ప్రతి ఒక్కరిలోనూ విలన్‌ ఉంటారు. ఆయా పరిస్థితులే వాళ్లని విలన్‌లుగా మారుస్తాయి. ఎవరి దృష్టిలో ఎప్పుడెవరు ఎలా కనిపిస్తారన్నదే జీవితం. ముఖ్యంగా కళాకారుడు మృత్యుంజయుడు అని కమల్ చెప్పాలన్న తాపత్రయం ఇందులో కనపడుతుంది. ఈ సినిమాలో ఉత్తమన్‌ అనే 8వ శతాబ్ధం నాటి కళాకారుడి పాత్రలో, మనోరంజన్‌ అనే 21వ శతాబ్ధపు సినిమా స్టార్‌ పాత్రలో కమలహాసన్‌ ఒదిగిపోయి నటించారు. అందుకు కమల్ కి ఎవరూ సాటి రారు అని మరోసారి విజిల్ వేసి మరీ చెప్పాలనిపిస్తుంది. అయితే వచ్చిన చిక్కల్లా ఆయన గెటప్ ల మీద, స్టోరీ ఐడియా మీద పెట్టి శ్రద్ద కథనం పై పెట్టలేకపోతున్నారు. తను అనుకున్న లేదా తన దగ్గర ఉన్న లేదా తను పోగుచేసిన అనేకానేక అంశాలను తన దగ్గర ఉన్న కథలో కలిపేసి, ఒకదానికొకటి ముడిపెట్టాలని చూడటం, వాటిని ఓ ఐడియా ద్వారా కలిపి ఉంచాలని ప్రయత్నం ప్రతీసారి చేస్తున్నారు. అయితే అది విజయవంతంగా జరగటం లేదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X